Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడు పై మోడీ వ్యూహం.. త‌మిళ‌ ప్ర‌జ‌ల‌ను ఎలా మారుస్తున్నారంటే!

By:  Tupaki Desk   |   19 April 2023 10:02 AM GMT
త‌మిళ‌నాడు పై మోడీ వ్యూహం.. త‌మిళ‌ ప్ర‌జ‌ల‌ను ఎలా మారుస్తున్నారంటే!
X
ద‌క్షిణాది పై క‌న్నేసిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.. చాలా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇక‌, ఏపీని అప్పుల పాలు చేసి.. జ‌గ‌న్‌ పై అప్పుల సీఎం గా ముద్ర వేసి పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు క‌ర్ణాట‌క‌లో ఎలానూ బీజేపీనే అధికారంలో ఉంది ఇక మిగిలింది త‌మిళ‌నాడు. మ‌రి ఇక్క‌డ బీజేపీ ప‌ప్పులు అంత తేలిక‌గా ఉండ‌క‌వు. మ‌రి ఈ విష‌యం ప్ర‌ధానికి తెలియ‌దా? అంటే తెలుసు.

అందుకే మోడీ చాలా వ్యూహాత్మ‌కంగా నొప్పి తెలియ‌కుండా ఎవ‌రూ విమ‌ర్శించ‌లేని విధంగా ఇక్క‌డ పావులు క‌దుపుతున్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌ను బీజేపీ వైపు మ‌ళ్లించే వ్యూహాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని మ‌రింత పుం జుకునేలా చేశారు ఇప్ప‌టికే గ‌త ఏడాదిలో.

'కాశీ-త‌మిళ సంగ‌మం' పేరుతో ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి అమ‌లు చేశారు. త‌మిళ ప్ర‌జ‌ల‌ను వివిధ జిల్లాల నుంచి ఉచితంగా అన్ని ఖ‌ర్చులు కేంద్రం భ‌రించి కాశీకి తీసుకు వ‌చ్చింది. ఇక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధిని మోడీ విజ‌న్‌ను వివ‌రించింది.

అంటే మోడీ విజ‌న్‌ను ప్ర‌చారం చేసుకునే ఉద్దేశం ప్ర‌త్య‌క్షంగా క‌నిపించింది ఇక‌, ఇప్పుడు ఏకంగా. సౌరాష్ట్ర‌-త‌మిళ సంగ‌మం పేరుతో త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌ను గుజ‌రాత్‌కు త‌ర‌లిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. గ్రామ గ్రామాన ప్ర‌జ‌ల‌ను ఉచితంగా గుజ‌రాత్ చూపిస్తాం అంటూ బీజేపీ నాయ‌కులు ఇల్లుల్లూ తిరుగుతున్నారు. వారిని సౌరాష్ట్ర‌కు తీసుకువెళ్లే బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రుల‌కు అప్ప‌గించారు. ఇప్ప‌టికే ఒక బృందం గుజ‌రాత్‌కు కూడా చేరుకుంది.

ఇలా ద‌ఫ‌ద‌ఫాలుగా త‌మిళుల‌ను గుజ‌రాత్‌కు తీసుకువెళ్లి. అక్క‌డి సంస్కృతి, సంప్ర‌దాయాల పేరుతో అభివృద్ధిని వివ‌రించ‌నున్నారు. అదేస‌మ‌యంలో మోడీ విజ‌న్‌ను వివ‌రించ‌నున్నారు. త‌ద్వారా త‌మిళ‌నాడులో బీజేపీ పుంజుకునేలా మోడీ ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే దీనిని కాద‌న‌లేక‌ ఔన‌న‌లేక‌ అధికార ప్ర‌తిప‌క్షాలు త‌ల్ల‌డిల్లుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనిని ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు దటీజ్ మోడీ అని కామెంట్లు చేస్తున్నారు.