Begin typing your search above and press return to search.
మోడీ వ్యూహం ఫలించదు.. రీజన్ ఇదేనా?
By: Tupaki Desk | 5 May 2021 3:30 AM GMTదేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం ఏంటి? అది ఫలిస్తుందా? అంటే.. కాదనే అంటున్నారు పరిశీల కులు. తాజాగా వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే.. మోడీ వ్యూహం ఎప్పటికీ.. ఫలించే అవ కాశం లేదని అంటున్నారు. అసలు మోడీ.. వ్యూహం ఏంటి? అంటే.. గతంలో ఇందిరాగాంధీ అనుసరించిన వ్యూహమే! దేశం మొత్తాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని.. తన వ్యతిరేక వర్గాన్ని అణిచి వేసి.. అధ్యక్ష తరహా పాలనను తెరమీదికి తీసుకురావడమే లక్ష్యంగా ఇందిరా.. ముందుకు సాగారు. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ వంటివాటిని విధించారు.
ఇక, ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత.. ఎమర్జెన్సీని చీకటి రోజుగా అభివర్ణిస్తూనే.. ప్రధాని మోడీ కూడా ఈ తరహా పాలనవైపే అడుగులు వేస్తున్నారు. ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే విధానం.. అనే నినాదాలు అందుకున్నారు. బీజేపీని దేశవ్యాప్తం చేసేందుకు.. ఆ పార్టీ విధానాలను ప్రజలపై రుద్దు తున్నారు. ఈ క్రమంలో తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బీజేపీ పట్టులేని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అణిచేయడం.. పైచేయి సాధించడం అనే విధానాలను మోడీ ఎంచుకున్నారు. అయితే.. ఇవి ఎక్కడా ఫలించడం లేదు.
రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ బలంగా ఉంది. బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉన్నా.. బలహీనంగా ఉంది. ఇక, బెంగాల్‌లో పాతుకుపోతామని ఇటీవల ప్రకటించినా.. మమతను పక్కకు పంపేస్తామని.. చెప్పినా.. ఇక్కడి ప్రజలు బీజేపీని విశ్వసించలేదు. ఇక, మధ్యప్రదేశ్లో అతికష్టం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. చత్తీస్‌గడ్‌లో ఉన్న అధికారాన్ని కూడా కూల్చేసుకుంది. తెలంగాణలో ఎదుగుతామని ప్రగల్భాలు పలికినా.. దుబ్బాక తప్ప మిగిలింది శూన్యమనే చెప్పాలి.
ఇక, ఏపీలో ఇప్పట్లో బీజేపీ గాలలు వీచే అవకాశం లేదని అంటున్నారు. తమిళనాడులో అధికార పార్టీతో జట్టుట కట్టినా.. ప్రయోజనం లేకుండా పోయింది. కేరళలో ఉన్న ఒక్క స్థానం పోగొట్టుకుని.. స్వామియే శరణం అయ్యప్ప అనేసింది. పంజాబ్‌లోనూ ఇదే పరిస్థితి. రాజస్థాన్‌లో ఉన్నది కూడా పోయింది. మహారాష్ట్రలోనూ మోడీ సత్తా చాటలేక పోతున్నారు. శివసేన ప్రభుత్వం వచ్చింది. గోవాలో ఎలా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసు. ఒడిశాలో నవీన్.. మోడీని ఎంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచుతున్నారు.
దేశరాజధాని ఢిల్లీలోనూ కేజ్రీవాల్‌కు ఎదురునిలిచి నిలబడలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం.. రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని చెరిపేసి అన్ని రాష్ట్రాలు ఒకేలా కనిపించేలా చేయడం ఆయన అజెండాగా ఉండడమే! రాష్ట్రాలకు ఒకే రంగు, ఒకే జెండా, ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే ఆలయం ఉండాలని ఆయన ఆశిస్తుండడమే!!. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఒడిషా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో బలమైన ప్రాంతీయ నాయకులున్నారు. అందువల్ల ఈ రాష్ట్రాల ఉనికిని, దాని ప్రయోజనాలను ప్రజలు వదులుకోరు.
తెలుగుదేశం, అన్నాడీఎంకే వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా అపుడపుడు బీజేపీతో చేతులు కలిపినా, రాష్ట్రాన్ని బీజేపీ జాగీరును చేసేందుకు ఇష్టపడవు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పాగా వేసుకుంటుందని తెలిస్తే.. ఈ మిత్రపక్షాలే.. అడ్డుపడుతున్న సందర్భాలు.. గతంలో అనేకం ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఒడిషాలో బిజూ జనతా దళ్ చేసింది, ఇపుడు డిఎంకె, తృణమూల్ చేస్తున్నది కూడా ఇదే. సో.. మోడీ కలలు సాకారం కావడం అనేది.. ఇప్పట్లో సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు.
ఈ క్రమంలోనే హిందీయేతర రాష్ట్రాల్లో మోడీ వ్యూహం ఫలించడం లేదు. నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, పినరయి విజయన్ లు ఉన్నంతవరకు మోడీ హవా ఈ రాష్ట్రాల్లో నడవదనేది నిర్వివాదాంశం. అందుకే మోడీ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఓట్లుగా, సీట్లుగా మారడం చాలా కష్టం అంటున్నారు.