Begin typing your search above and press return to search.

బాబు సాక్షిగా తెలంగాణ‌పై ప్రేమ‌ను చూపిన మోడీ

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:23 PM GMT
బాబు సాక్షిగా తెలంగాణ‌పై ప్రేమ‌ను చూపిన మోడీ
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌పై త‌న‌కున్న ఆస‌క్తిని మ‌రోమారు ప్ర‌ద‌ర్శించారు. దేశ‌ ప్ర‌ధాన‌మంత్రిగా ఒక రాష్ట్రంపై ఆస‌క్తి చూప‌డంలో త‌ప్పేం లేదు. అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణాఈమం ఏమిటంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సాక్షిగా తెలంగాణ గురించి ఆస‌క్తిని క‌న‌బ‌ర్చారు. ఇది జ‌రిగింది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌లో. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన టెక్స్‌టైల్స్ ఇండియా -2017 సదస్సు సంద‌ర్భంగా.

టెక్స్‌టైల్స్ ఇండియా సద‌స్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ త‌ర‌ఫున టెక్స్‌టైల్స్ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శన స్టాళ్లలో కలియతిరిగారు. ఈ క్ర‌మంలో మోడీ వెంట ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉన్నారు. ఇలా చుట్టేస్తున్న స‌మ‌యంలో తెలంగాణ చేనేత స్టాల్ ద‌గ్గ‌ర ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ప్ర‌త్యేకంగా ఆగారు. చేనేత వస్ర్తాల తయారీ, ఇతర వివరాలను మోడీ తెలుసుకున్నారు. చేనేత యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేక ఆస‌క్తిని చంద్ర‌బాబు గ‌మ‌నించ‌డం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/