Begin typing your search above and press return to search.
మోదీ స్టేడియంలో 5 వరల్డ్ కప్ మ్యాచ్ లు.. ఇదేమి చోద్యం?
By: Tupaki Desk | 28 Jun 2023 4:59 PM GMTప్రత్యక్షంగానో, పరోక్షంగానో వన్డే ప్రపంచ కప్ పై ప్రధాని మోదీ ముద్ర ఉండనుంది. అది మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఐదు మ్యాచ్ ల నిర్వహణ రూపంలో ఇప్పటికే బయటపడింది. ఇక ఫైనల్ కూడా అక్కడే జరగనుంది. ప్రపంచ కప్ ఫైనల్ కు ఎలాగూ దేశ ప్రధాని హోదాలో అతిథులుగా వచ్చే ఇతర దేశాధినేతలతో కలిసి హాజరవుతారు. తన చేతులమీదుగానే కప్ ను విజేత జట్టుకు అందజేస్తారు. ఈ లెక్కన చూసినా.. సొంతగడ్డ మీద నుంచి మోదీ ఎన్నికలకు ఆరు నెలల ముంగిట తన ముద్ర చూపించుకోనున్నారు.
అయినా.. నాలుగేళ్లకోసారి జరిగే మహా సమరంలో విజేత జట్టుకు.. ((అది భారత్ అయితే మరీ సంతోషం)) ప్రపంచ కప్ అందించే అరుదైన భాగ్యం అందరికీ రాదు.. అందులోనూ మోదీ వంటి వారు అలాంటి చాన్సు వస్తే ఎందుకు వదులుకుంటారు..? అందుకే ఫైనల్స్ ను తనపేరిటే ఉన్న స్టేడియంలో చూస్తూ.. తానే ప్రపంచ కప్ విజేతకు ట్రోఫీ అందిస్తూ.. మోదీ చరిత్రలో నిలిచిపోనున్నారు.
మొత్తం 10 వేదికలు.. 10 జట్లు.. 48 మ్యాచ్ లు.. 46 రోజులు.. ఇదీ అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న 2023 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్. అక్టోబరు 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో మొదలయ్యే ప్రపంచ కప్ నవంబరు 19న అక్కడే ముగియనుంది. రెండు సెమీస్, ఫైనల్ సహా మొత్తం 48 మ్యాచ్ లకు 10 నగరాల్లో జరుగుతాయి. ప్రారంభ, ఫైనల్ తో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ పోరాటానికి నరేంద్ర మోదీ స్టేడియమే వేదిక.
ఈ స్టేడియం 1.32 లక్షల మంది ప్రేక్షకులు పట్టే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దది. అయితే తాము ఇక్కడ ఆడబోమని.. అహ్మదాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు లేదా కోల్‌కతాకు మ్యాచ్ ను తరలించాంటూ పాక్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ, బీసీసీఐ పట్టించుకోలేదు.
విన్నర్స్.. రన్నర్స్ మధ్య తొలి మ్యాచ్
గత ప్రపంచ కప్ లో హైలైట్ అంటే ఫైనల్ మ్యాచే. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఆ సమరంలో బౌండరీల లెక్కన ఇంగ్లాండ్ గెలుపొందింది. ఈసారి కూడా ఆ జట్ల మధ్యన మ్యాచ్ తోనే ప్రపంచ కప్ మొదలవనుంది. అక్టోబరు 5న నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ జట్లు తలపడతాయి. కాగా, వరల్డ్ కప్ నకు అహ్మదాబాద్, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిలిచే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు మొత్తం 5 మ్యాచ్ లకు నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ప్రపంచ కప్ లో మరే మైదానంలోనూ ఇన్ని మ్యాచ్ లు జరగడం లేదు. న్యూజిలాండ్-ఇంగ్లండ్, భారత్-పాక్, ఫైనల్స్ తో పాటు సమ ఉజ్జీలు, హోరాహోరీ పోరు జరిగే వీలున్న అస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. ప్రపంచ కప్ లలో బ్యాడ్ లక్ కు మారుపేరైన దక్షిణాఫ్రికాతో సంచలనాల అఫ్గానిస్థాన్ అహ్మదాబాద్ లోనే తలపడనుంది. కాగా, 1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019 వన్డే ప్రపంచ కప్‌లలో భారత్, పాక్ తలపడ్డాయి. ఈ 7 మ్యాచ ల్లోనూ భారత్ గెలిచింది. ఈ మధ్యలో 2007 ప్రపంచ కప్ లో మాత్రమే ముఖాముఖి పోటీపడలేదు. చిత్రమేమంటే.. రెండు జట్లూ నాటి టోర్నీ తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి.