Begin typing your search above and press return to search.
మోడీ లోపలి పొలిటీషియన్ నిద్ర లేచాడు
By: Tupaki Desk | 3 Jan 2017 4:49 AM GMTప్రధాని మోడీ మాటలు చాలావరకూ పెద్దమనిషి తరహాలోనే ఉంటాయి. స్ఫూర్తిని రేకెత్తిస్తూ.. జాతిని కదిలించేలా మాట్లాడటం తరచూ చూస్తుంటాం. వివిధ వేదికల మీద ఆయన మాట్లాడే ప్రతి మాట.. ఒక మెంటార్ మాట్లాడినట్లే ఉంటుంది తప్పించి.. ఒక రాజకీయ నేత మాట్లాడినట్లుగా కనిపించదు. అయితే.. ఎన్నికల వేళ మోడీ టోన్ పూర్తిగా మారిపోతుంది. తాజాగా ముంచుకొస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ టోన్ పూర్తిగా మారిపోయింది. ఇంతకాలం పెద్దమనిషిలా మాట్లాడిన మోడీలోని రాజకీయ నాయకుడు నిద్ర లేచాడు.
తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయటమే కాదు.. తమకు పోటీగా నిలిచే వారిపై మాటలతో మంట పుట్టించారు. ఫక్తు రాజకీయ నేతగా మోడీ చేసిన ప్రసంగాన్ని చూస్తే.. అవసరానికి తగ్గట్లు నేర్పు మోడీలో ఎంత ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. అవినీతిపై.. నల్లధనంపై కేంద్రం చేపట్టిన చర్యల గురించి చెప్పుకోవటమే కాదు.. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై మోడీ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.
కేంద్రం పూర్తిగా మద్దుతు ప్రకటించినప్పటికీ యూపీ అధికారపక్షం అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మోడీ.. తాజాగా జరగనున్న యూపీ ఎన్నికల్లో బీజేపీకి కానీ అధికారాన్ని కట్టబెడితే.. అభివృద్ధిని దౌడు తీయిస్తామని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ మాటలన్నీ ఫక్తు రాజకీయ నేతను తలపించేలా ఉండటం గమనార్హం.
‘‘మీరు ఎప్పుడైనా ఎస్పీ.. బీఎస్పీలు కలిసి ఉండటం చూశారా? ఎస్పీ అవునంటే.. బీఎస్పీ కాదంటుంది. కానీ.. చాలా కాలం తర్వాత వారిద్దరూ ఏకమయ్యారు. మోడీని మార్చేయాలి. మోడీని తొలగించాలని వారు అంటున్నారు. మోడీ మాత్రం మీ నల్లధనాన్ని మార్చుకోండి.. నల్లధనాన్ని తొలగించాలని అంటున్నాడు.ఒక పార్టీ(కాంగ్రెస్) కుమారుడిని గొప్ప నాయకుడిగా చూపించేందుకు పదిహేనేళ్ల నుంచి కష్టపడుతోంది. మరో పార్టీ (బీఎస్పీ) సంపాదించింది ఎక్కడ దాచుకోవాలో ఆందోళన చెందుతుంది. ఇంకో పార్టీ (ఎస్పీ) కుటుంబ అదృష్టాన్ని టెస్ట్ చేసుకునేందుకు సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. ఇలాంటి పార్టీలు యూపీని అభివృద్ధి చేస్తాయా? అన్నది ప్రజలు ఆలోచించాలి’’ అంటూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాల్ని సంధించారు.
గడిచిన పద్నాలుగేళ్లుగా యూపీలో అభివృద్ధి అన్నది లేకుండా పోయిందని.. చాలా రోజులుగా ఇక్కడి ప్రజలు కుటుంబ రాజకీయాల్ని చూస్తున్నారని.. యూపీలో అభివృద్ధి జరిగిందా? లేదా? అన్నది వారికి తెలియాలన్నారు. మోడీ అవినీతిపరుల డబ్బును తీసుకొని పేదోళ్లకు ఇస్తానంటే కొందరు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని.. అవినీతిని తొలగించే వరకూ తాను చేపట్టిన యుద్ధం ఆగదని స్పష్టం చేశారు. 30 ఏళ్ల తర్వాత తొలిసారి కేంద్రం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలుగుతుందని.. తొలిసారి దేశానికి ఒక ప్రధాని ఉన్నారని.. కేంద్ర ప్రభుత్వం ఉందని.. 125 కోట్ల మంది ప్రజలే దాని హైకమాండ్ అని ఆయన వ్యాఖ్యానించారు. యూపీలో అభివృద్ధి కోసం బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వాలని కోరారు. మరి.. మోడీ నోటి నుంచి వస్తున్న రాజకీయ ప్రసంగాలకు యూపీ ప్రజలు ఎంతలా రియాక్ట్ అయ్యారన్నది ఎన్నికల ఫలితాల స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/