Begin typing your search above and press return to search.

50 నిమిషాల స్పీచ్ లో పార్టీకి మోడీ మాట ఇదే..

By:  Tupaki Desk   |   8 Jan 2017 5:27 AM GMT
50 నిమిషాల స్పీచ్ లో పార్టీకి మోడీ మాట ఇదే..
X
రెండు రోజులుగా సాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తాజాగా ముగిశాయి. శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ముగింపు ప్రసంగాన్ని చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా చోటు చేసుకున్నపరిణామాలతో పాటు.. తన తదుపరి లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు. ఎన్నికల సంస్కరణలపై తన వాణిని వినిపించిన మోడీ.. తనకు అధికారం.. స్వర్గం.. మరో జన్మపై వాంఛల్లేవని.. ప్రజల కష్టాలు తొలగించటంపైనే తన కోరిక అన్న మాటను చెప్పే ఒక సంస్కృత శ్లోకాన్ని ఉటంకించటం గమనార్హం.

యాభై నిమిషాలు సాగిన మోడీ స్పీచ్ లోని కీలకాంశాల్ని చూస్తే..

1. పేదలకు సేవ చేయటం దేవుడికి సేవ చేయటం లాంటిదే.

2. పెద్దనోట్ల రద్దు అనేది నల్లధనం.. అవినీతిపై దీర్ఘకాలిక పోరాటానికి ఆయుధం.

3. ఎన్నికల సంస్కరణకు రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కావాలి.

4. పార్టీలకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది.

5. నోట్ల రద్దుపై వస్తున్న విమర్శల్ని స్వాగతించాలని.. ఆరోపణలతో అపకీర్తి పాలవ్వొద్దు.

6. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజీపీ విజయాన్ని సాధిస్తుంది.

7. చారిత్రాత్మక నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశంలోని నిరుపేదలు ఆమోదించారు.

8. అవినీతి సహా సామాజిక రుగ్మతల్ని రూపు మాపే దిశగా ఇది సరైన అడుగుగా వారు భావించి అంగీకరించారు.

9. గడిచిన రెండునెలల్లో దేశం సమాజ బలాన్నిప్రత్యక్షంగా చూసింది.

10. నగదు ఉపసంహకరణకు ప్రజల మద్ధతు లభించటంతో పార్టీ బాధ్యత పెరిగింది.

11. ఎన్నికల్లో గెలవటానికి పేదలు.. పేదరికం సాధనాలు కావాలి కానీ.. ఈ అంశాల్ని ఓటుబ్యాంకు అద్దాల్లో నుంచి పార్టీ చూడదు.

12. పార్టీ నేతలు తమ సంతానం కోసం ఎన్నికల్లో టికెట్లు అడగొద్దు.

13. టిక్కెట్ల కేటాయింపు వ్యవహారాన్ని పార్టీ యంత్రాంగం చూసుకుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/