Begin typing your search above and press return to search.

మోడీ మెగాభిమానం...వారి చుట్టూనే అలా...!

By:  Tupaki Desk   |   17 March 2023 6:17 PM GMT
మోడీ మెగాభిమానం...వారి చుట్టూనే అలా...!
X
ఆయన దేశంలో బలమైన నాయకుడు. ఇపుడు విశ్వ నాయకుడిగా అవతరిస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు మోడీ వైపు చూస్తున్న పరిస్థితి. అయితే మోడీ దేశం గురించి ఆలోచిస్తూనే బీజేపీ రాజకీయం గురించి కూడా గట్టిగానే ఆలోచిస్తున్నారు. ఈ క్రామంలో మోడీ చూపు సౌత్ స్టేట్స్ మీద ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల మీద ఫుల్ ఫోకస్ ఉంది.

మోడీ అదే క్రమంలో మెగా ఫ్యామిలీ మీద తన దృష్టిని సారించారని అంటున్నారు. నిజానికి చూస్తే గత తొమ్మిదేళ్ళ నుంచి ఈ బంధం సాగుతోంది. 2014లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా మోడీ జనంలోకి వచ్చినపుడు సౌత్ స్టేట్స్ నుంచి పవర్ ఫుల్ సెలిబ్రిటీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చారు నేరుగా గుజరాత్ వెళ్ళి మరీ మోడీతో భేటీ కూడా అయ్యారు.

నాటి నుంచి మోడీ పట్ల పవన్ అదే గౌరవభావాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో జరిగిన సభలో సైతం మోడీ అంటే తనకు అపార గౌరవముంది అని చెప్పుకొచ్చారు. గత ఏడాది నవంబర్లో విశాఖ వచ్చిన ప్రధాని మోడీ ప్రత్యేకంగా పవన్ని రప్పించుకుని మరీ గంట సేపు ఏకంతంగా భేటీ వేశారు.

ఇదిలా ఉంటే గత ఏడాది జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు మెగాస్టార్ చిరంజీవిని పిలవడం వెనక మోడీ ఆలోచన ఉందని అంటారు. ఆ వేదిక మీద చిరుతో ప్రధాని ముచ్చటించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. అదే ఏడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం తరఫున అవార్డుని ఇవ్వడం వెనక కూడా బీజేపీ అభిమానం దాగుందని అంటారు.

ఇపుడు ఆయన నట వారసుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రధాని మోడీ భేటీ అవుతున్న వార్తలు జాతీయంగా సంచలనం రేపుతున్నాయి. ట్రిపుల్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్ లో నేమ్
ఫెమ్ సాధించారు. ఆస్కార్ అవార్డుని ట్రిపుల్ ఆర్ కి దక్కించుకుని వస్తున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్ లో హోం మంత్రి అమిత్ షాతో కలిసి పాల్గొంటున్నారు. ఆ తరువాత ఆయన ప్రధాని మోడీతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు అని అంటున్నారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి రామ్ చరణ్ కి ఆహ్వానం లభించింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మెగా ఫ్యామిలీలో టాప్ రేంజి హీరోలు అయిన మెగాస్టార్ పవర్ స్టార్, మెగా పవర్ స్టార్లతో మోడీ భేటీలు వేయడం వెనక ఆయన అభిమానం ఏంటో తెలియచేస్తోందని అంటున్నారు. టాలీవుడ్ ఇందస్ట్రీలో బిగ్ పిల్లర్స్ గా ఉంటున్న ఈ హీరోల మీద బీజేపీ ఫోకస్ పెట్టిందని అంటున్నారు.

ఇప్పటికే జనసేన బీజేపీ మిత్ర బంధం అయితే అఫీషియల్ గా ఉంది. దాంతో మెగా హీరోలను తమ వైపునకు తిప్పుకునే ప్లాన్ ఏదో బీజేపీ పెద్దలలో ఉందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. చూడాలి మరి రాం చరణ్ తో ప్రధాని మోడీ భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తాయో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.