Begin typing your search above and press return to search.
పాక్ పార్లమెంటులో మోడీ నినాదాలు.. ఎవరు చేశారంటే?
By: Tupaki Desk | 29 Oct 2020 5:50 PM GMTకీలకమైన బిహార్ ఎన్నికలు జరుగుతున్న వేళలో దాయాది పాక్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ప్రధాని మోడీ ఇమేజ్ తారాస్థాయికి చేరేలా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మోడీ ధైర్యసాహసాల గురించి.. ఆయన వీరత్వం గురించి కమలనాథులు అదే పనిగా గొప్పలు చెప్పుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆయన ఇమేజ్ మరింత పెరిగే అంశాలు తాజాగా బయటకు రావటం తెలిసిందే.
భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పాక్ ఆర్మీకి పట్టుబడిన వేళలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ గజగజ వణికిని విషయం బయటకు రావటమే కాదు.. ప్రపంచం దేశాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారితే.. అనూహ్యంగా తాజాగా పాకిస్తాన్ పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామం మరో సంచలనమైంది.
పాకిస్తాన్ పార్లమెంటులో బలూచిస్తాన్ ఎంపీలు కట్టగట్టుకొని మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. పాక్ విదేశాంగ మంత్రికి కోపం కట్టలు తెగేలా చేసింది. అంతేకాదు.. తమ నినాదాలతోపాక్ విదేశాంగ మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో.. మండిపడిన ఆయన సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన..బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం అక్కడి ప్రజల నుంచి నినాదాలు రాకున్నా.. అక్కడి నాయకుల నుంచి రావటం సిగ్గుచేటుగా అభివర్ణించారు. మొత్తంగా మోడీ ఇమేజ్ భారీగా పెరిగిపోయేలా పరిణామాలు వరుస పెట్టి చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.