Begin typing your search above and press return to search.

మోడీ ప్రస్తావించిన గంగదేవిపల్లి ప్రత్యేకతేంటి?

By:  Tupaki Desk   |   27 Feb 2017 4:49 AM GMT
మోడీ ప్రస్తావించిన గంగదేవిపల్లి ప్రత్యేకతేంటి?
X
సమకాలీన భారతంలో మరే ప్రధానమంత్రి చేయని రీతిలో మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలకు తరచూ టచ్ లో ఉండే కార్యక్రమాన్ని మోడీ చేపట్టిన విషయం తెలిసిందే. వివిధ అంశాల మీద మాట్లాడే మోడీ.. తన దృష్టికి వచ్చిన అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. వివిధ అంశాల మీద తన అభిప్రాయాల్ని వ్యక్తం చేయటం.. దేశ ప్రజలకు స్ఫూర్తివంతమైన మాటల్ని చెప్పటం ద్వారా తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారని చెప్పాలి. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. దేశ వ్యాప్తంగా చోటు చేసుకునే వివిధ అంశాల్ని మోడీ ప్రస్తావిస్తుంటారు. సువిశాల భారతంలో ప్రతి విషయం తన కంటి నుంచి పక్కకు పోవటం లేదన్న భావనను కలిగిస్తుంటారు. దీనికి తాజా నిదర్శనంగా గంగదేవిపల్లి ఉదాహరణగా చెప్పాలి. వరంగల్ జిల్లాకు చెందిన ఈ గ్రామం గురించి మోడీ ప్రస్తావించి తెలుగు ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేశారు. మోడీ ప్రస్తావించే వరకూ గంగదేవిపల్లి ప్రత్యేకత ఏమిటన్నది చాలామంది తెలుగు వారికి తెలీదనే చెప్పాలి. ఎక్కడి దాకానో ఎందుకు.. ఆ గ్రామం ఉన్న వరంగల్ జిల్లా వాసులకు కూడా తెలీదనే చెప్పాలి. సొంత జిల్లా వాసులకు తెలీని కొత్త విషయం అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న ప్రధాని మోడీకి తెలీడం ఎంత గొప్ప? అన్న భావన కలిగేలా చేయటమే మోడీ ప్రత్యేకత. తన తాజా మన్ కీ బాత్ లో ఆయన ప్రస్తావించిన గంగదేవిపల్లి ప్రత్యేకత ఏమిటన్నది చూస్తే..

వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో నూటికి నూరు శాతం మరుగుదొడ్లను నిర్మించారు. అంతేకాదు.. ఇక్కడి మరుగుదొడ్లను రెండు గుంతల విధానంలో ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ రెండు గుంతల విధానంలో ఏం చేస్తారంటే.. మరుగుదొడ్డిని నిర్మించిన తర్వాత దానికి అనుసంధానంగా బయట ఆరు అడుగుల లోతులోరెండు గుంతల్ని సిమెంటు రింగులతో నిర్మిస్తారు.ఈ రెండు గుంతల మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తర్వాత మరుగుదొడ్డికి వాటిని పైపులతో అనుసంధానించి గుంతలపై మూతలు ఏర్పాటు చేస్తారు.

ఒక గుంత నిండిన తర్వాత మరో గుంతలోకి మలమూత్రాల్ని మళ్లిస్తారు. అలా నిండిన గుంతలో మల విసర్జితాల్ని ఏడాదిన్నరపాటు ఉంచేస్తారు. ఆ తర్వాత అది నత్రజని.. పొటాష్ లతో సమ్మిళితమైన సేంద్రీయ ఎరువులా మారటమే కాదు.. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పాలి. ఈ తరహా మరుగుదొడ్లను గంగదేవిపల్లిలో 305 నిర్మించారు. అంతేనా.. ఇటీవల ఈ గ్రామంలో వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మన చెంతనే ఉన్న గ్రామంలో ఇంత జరిగిందా? అన్న భావన కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/