Begin typing your search above and press return to search.
తెలంగాణకు మోడీ క్షమాపణలు చెప్పాలి: మంత్రి కేటీఆర్ డిమాండ్
By: Tupaki Desk | 9 Feb 2022 4:17 PM GMTప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 50 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని అవమానించినందుకు రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం, ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న కేటీఆర్.. ప్రధాని మోడీతో పాటు, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోడీ చేసింది శూన్యమని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రానికి ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణపై ముందు నుంచే మోడీకి పగ ఉందన్న కేటీఆర్.. దేశంలో మోడీ రాజ్యాంగం అమలవుతోందని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గుజరాత్ కంటే తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని మోడీకి కడుపుమంటగా ఉందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఈ సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలను ఆయన వివరించారు.
``గుజరాత్ కంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని మోడీకి కడుపుమంట. పచ్చని తెలంగాణను చూసి ఓర్వలేకపో తున్నారు. ఎనిమిదేళ్ల కింద మాట్లాడిన పనికమాలిన మాటలే మోడీ ఇప్పుడు మాట్లాడారు. విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషం నింపారు. దశాబ్దాల పోరాటాన్ని ప్రధానమంత్రి కించ పరిచారు. తెలంగాణకు ఇస్తానన్న కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదు. మోడీ ఎనిమిదేళ్లలో తెలంగాణకు చేసింది శూన్యం`` అని మంత్రి కేటీఆర్ తీవ్రస్తాయిలో వ్యాఖ్యానించారు.
తెలంగాణపై ముందు నుంచే మోడీకి పగ ఉందన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారని.. ఎవరిని అడిగి ఇలా చేశారని.. నిలదీశారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదు.. మోడీ రాజ్యాంగమే అమలవుతోందని.. ప్రతిచోటా ఆయన పాటే వినిపిస్తోందని.. అన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని మోడీ పాలిస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణపై విషం చిమ్మే బీజేపీని మేధావులు ఓ కంట కనిపెట్టాలన్నారు.