Begin typing your search above and press return to search.
శంకుస్థాపనకు మోడీ వచ్చేస్తున్నారు
By: Tupaki Desk | 9 Oct 2015 1:00 AM GMTముహుర్తం దగ్గర పడుతున్నా.. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే విశిష్ఠ అతిధులకు సంబంధించి షెడ్యూల్ పై మాత్రం సందిగ్థత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఏపీ రాజధాని అమరావతికి ప్రధానమంత్రి మోడీ పర్యటన ఖరారైంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని అధికారిక షెడ్యూల్ విడుదలైంది.
దీని ప్రకారం.. ఈ నెల 22న ప్రధాని మోడీ ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11.45 గంటలకు చేరుకునే ఆయనకు అధికారులు స్వాగతం పలుకుతారు.
అమరావతిలోని శంకుస్థాపన చేసే ప్రాంతానికి మధ్యాహ్నం 12.35 గంటలకు చేరుకోనున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన జరిపే చోట దాదాపు రెండు గంటల పాటు గడపనున్నారు. అనంతరం ఆయన తిరుపతికి పయనమవుతారు. గన్నవరం నుంచి రేణిగుంట వరకు ప్రత్యేక విమానంలో వెళ్లే ఆయన.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.25 గంటలకు స్వామి వారిని దర్శించుకొని.. రాత్రి 7.30గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు.