Begin typing your search above and press return to search.

వ్యర్థాలతో బంగారం వెలికి తీయొచ్చు అంటున్న ప్రధాని..!

By:  Tupaki Desk   |   30 Jan 2023 12:25 PM GMT
వ్యర్థాలతో బంగారం వెలికి తీయొచ్చు అంటున్న ప్రధాని..!
X
పెరుగుతున్న సాంకేతికను వినియోగించుకునే దాన్ని బట్టి అది మనకు మంచి.. లేదా చెడు చేస్తుంది. టెక్నాలజీ అనేది మనిషి జీవనాన్ని మరింత సులభంగా మారుస్తుందనే సంగతి తెల్సిందే. అయితే మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఈ వ్యర్థాలతో మానవాళికి నష్టం తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో పాటు ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరి ఇళ్లలో టీవీలు.. స్మార్ట్ ఫోన్లు.. ల్యాప్ టాప్ లు వచ్చి చేరాయి. డాటా ప్యాకేజీలు మరింత చౌకగా లభిస్తుండడంతో వీటి వినియోగం సైతం రోజురోజుకు పెరిగిపోతోంది. కంపెనీల మధ్య పోటీ కారణంగా తక్కువ ధరల్లోనే కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తుండటంతో ఈ వేస్టేజీ గణనీయంగా పెరిగి పోతుంది. ఇదే విషయంపై ఇటీవల జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 800 పాత ల్యాప్ టాప్ లను పక్కన పడేస్తున్నారని ప్రధాని మోదీ వివరించారు. వీటిలో నిక్షిప్తమైన 17 రకాల విలువైన లోహలను ఒక పద్ధతి ప్రకారంగా వెలికితీస్తే వీటి నుంచి బంగారాన్ని సృష్టించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరితో చేతిలో స్మార్ట్ ఫోన్లు.. ప్రతి ఇంట్లో ల్యాప్ టాప్ లు.. టీవీలు సర్వసాధారణమై పోయాయన్నారు. వీటి సంఖ్య దేశంలో వందల కోట్లకు చేరిపోయిందని తెలిపారు. ఈ వ్యర్థాన్ని సరిగ్గా వదిలించుకోకపోతే అది ప్రకృతికి హాని కలిగిస్తుందని తద్వారా మానవాళికి తీరని నష్టం కలుగుతుందని వివరించారు.

ప్రతి యేటా 50 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలను పారబోస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానవ చరిత్రలో తయారు చేసిన విమానాలన్నింటినీ కలిపి తయారు చేసిన పరిణామానికి తూకం వేసిన సమానం కాదని వెల్లడించారు. ప్రతి సెకనుకు 800 ల్యాప్ టాప్ లను పాడేస్తున్నారని.. వీటిని రీ సైక్లింగ్ చేయడం ద్వారా బంగారం.. వెండి.. రాగి.. నికెల్ సహా 17 రకాల విలువైన లోహాలను వెలికి తీయవచ్చని వివరించారు. ఈ దిశలో పని చేసే స్టార్టప్ లకు దేశంలో కొదవ లేదన్నారు.

మన దేశంలో సుమారు 500 ఈ వ్యర్థాల రీ సైక్లర్స్ పని చేస్తున్నారని.. వీరికి కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తోడవుతున్నారని పేర్కొన్నారు. ఈ రంగంలో వేలాది మందికి ఉపాధి కలుగుతుందని.. ఇలాంటి ప్రయత్నాన్ని బెంగుళూరుకు చెందిన ఈ-పరిసర సంస్థ ప్రయత్నం చేస్తుందని వివరించారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల నుంచి విలువైన లోహలను వెలికితీస్తుందన్నారు. ముంబాయి.. ఉత్తరాఖండ్ లోని రూర్కెలా.. మధ్యప్రదేశ్.. బోపాల్ లోని పలు సంస్థలు మొబైల్ యాప్ ద్వారా టన్నుల కొద్దీ ఈ వ్యర్థాలను సేకరిస్తున్నాయని వివరించారు.

ఈ చర్యలన్నీ భారత్ ను ప్రపంచ రీ సైక్లింగ్ హబ్ గా మార్చేందుకు దోహద పడుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. ఈ వ్యర్థాలను క్రమ పద్ధతిలో పెట్టాలని సూచించారు. నమో యాప్ ద్వారా తెలంగాణకు చెందిన విజయ్ అనే ఇంజనీర్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ ఈ వ్యర్థాలపై మన్ కీ బాత్ లో ప్రస్తావించినట్లు వెల్లడించారు. ఏది ఏమైనా భారత్ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలో అందరికీ కంటే ముందుండటం మాత్రం అభినందనీయమనే చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.