Begin typing your search above and press return to search.
మోడీ కలల విగ్రహం మళ్లీ తెరమీదకు వచ్చింది
By: Tupaki Desk | 18 Feb 2018 7:51 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల విగ్రహం ఫార్ములా మళ్లీ తెరమీదకు వచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నర్మదా నదిపై సర్ధార్ సరోవర్ డామ్ దగ్గర నిర్మిస్తున్న సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహ ఆవిషర్కరణకు రంగం సిద్దమైంది. పటేల్ పుట్టిన రోజు అయిన అక్టోబర్ 31 న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.182 మీటర్ల పొడవైన ఈ విగ్రహాన్ని.. రూ. 3 వేల కోట్లతో నిర్మించారు. 2013 లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధాని మోడీ శంకుస్ధాపన చేశారు. 526 స్వతంత్ర రాజ్యాలను భారత యూనియన్ లో విలీనం చేసిన సర్ధార్ ను “ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా”గా వర్ణిస్తూ మోడీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పీపీపీ పద్దతిలో ఈ ప్రాజెక్టును L&T చేపట్టింది. ఈ మెమోరియల్ ను జాతికి అంకితం చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణతో ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద విగ్రహం కానుంది.
అయితే ఇది పూర్తిగా ఎన్నికల ప్రాజెక్టు అని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు అయిన అనంతరం ఈ ప్రాజెక్టు గురించి హల్ చల్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీం అనంతరం పక్కనపెట్టిందనే టాక్ ఉంది. అందుకే నిర్మాణం ఆలస్యం అయిందని కూడా కొందరు చెప్తుంటారు. మరోవైపు మోడీ మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టుకు కార్పొరేట్ల చమురు వదిలించిందనేది కొందరి అభిప్రాయం. భారత కంపెనీల చట్టం- 2013 ప్రకారం కార్పొరేట్ సంస్థలు తమ నికర లాభాల నుంచి 2శాతం నిధుల్ని సామాజిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన పథకాల కోసం ఖర్చు చేయాలి. ఈ ఐక్యతా స్తూపం(ఎస్‌వోయూ) కోసం ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఒక్క ఏడాదిలోనే రూ.121 కోట్ల నిధులను సమకూర్చాయి.
2017 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన నివేదికల ప్రకారం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్ జీసీ) రూ.50 కోట్లు - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ పీసీఎల్) రూ.25 కోట్లు - ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్) రూ.25 కోట్లు - ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) రూ.21.83 కోట్లు ఎస్‌వోయూ నిర్మాణానికి సహాయ నిధిగా అందించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ ఆర్) కింద ఈ నిధుల్ని చమురు సంస్థలు గుజరాత్ ప్రభుత్వానికి అందించాయి. సీఎస్ ఆర్ కింద జాతీయ వారసత్వనిర్మా ణాల కోసం 92లిస్టెడ్ కంపెనీలు అందించిన నిధుల వివరాలున్నాయి. 2017 సెప్టెంబర్ 18 వరకూ రూ.155.78 కోట్లు సీఎస్ ఆర్ కింద ప్రభుత్వానికి లిస్టెడ్ కంపెనీలు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు. గతే డాది ఈ కంపెనీలు సమకూర్చిన నిధి రూ.46.51కోట్లు మాత్రమే.