Begin typing your search above and press return to search.

మీమ్స్ ఎఫెక్ట్.. సెంట్రల్ విస్టా వద్ద మోడీ ఆంక్షలు

By:  Tupaki Desk   |   13 May 2021 3:30 PM GMT
మీమ్స్ ఎఫెక్ట్.. సెంట్రల్ విస్టా వద్ద మోడీ ఆంక్షలు
X
ఇటీవల సోషల్ మీడియాలో సోను సూద్ దేశ ప్రజల కోసం విదేశాల నుండి కోట్లు ఖర్చు చేసి ఆక్సిజన్ ప్లాంట్స్ ను తీసుకు వస్తుంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ప్రజల గురించి పట్టించుకోకుండా వందల కోట్లు ఖర్చు చేస్తూ నూతన పార్లమెంట్ భవనం ను నిర్మిస్తున్నాడు అంటూ మీమ్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమర్శకులు తెరతీసింది. సోషల్ మీడియాలో కొత్త పార్లమెంట్ నిర్మాణం కు సంబంధించి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి సెంట్రల్ విస్టా నిర్మాణం లో ఎలాంటి ఫోట్లు వీడియోల చిత్రీకరణకు అనుమతి ఇవ్వకూడదు అంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. సెంట్రల్ విస్టా లోకి బయటి వారికి అసలు అనుమతులు ఇవ్వకూడదని కూడా కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ను కూడా నిలిపివేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

సెంట్రల్ విస్టా నిర్మాణం పై మొదటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు విపక్ష పార్టీలు విమర్శకు గుప్పిస్తూ ఉన్నాయి. ఇక కరోన సమయంలో జనాలు సరైన వైద్యం అందక మృతి చెందుతూ ఉంటే ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చు వృధా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ విమర్శలు మరింతగా పెరగడం తో బిజెపి నాయకులు నష్ట నివారణ చర్యలకు సిద్ధం అయ్యారు.