Begin typing your search above and press return to search.

100 ఫైళ్లలో ఉన్న కొత్త సంగతులు ఎన్ని?

By:  Tupaki Desk   |   23 Jan 2016 9:58 AM GMT
100 ఫైళ్లలో ఉన్న కొత్త సంగతులు ఎన్ని?
X
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మృతి మిస్టరీ వెనుక ఎన్నో అనుమానాలు - ఊహాగానాలు.. దీనికి సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం.. బ్రిటన్ లోని నేతాజీ బంధువు ఒకరు ఇప్పటికే పలు ఫైళ్లను విడుదల చేయగా తాజాగా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీ కూడా శనివారం 100 ఫైళ్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా విడుదల చేశారు. అయితే... వాటివల్ల తెలిసే కొత్త అంశాలెన్నన్నదే ఇప్పుడు సరికొత్త ప్రశ్న. భారత ప్రభుత్వాలు పాడుతున్న పాత పాటే ఈ ఫైళ్ల లోనూ ఉంది. నేతాజీ విమాన ప్రమాదంలోనే మృతిచెందినట్లు ఆ రికార్డుల్లో ఉంది. 1945 ఆగస్టు 18న తైవాన్‌ లో విమానం కూలిపోవడంతో నేతాజీ మరణించారని తాజా పత్రాలు వెల్లడి చేశాయి.

నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ కు సంబంధించిన 100రహస్య పత్రాలను డిజిటల్ ఫైళ్ల రూపంలో ప్రధాని నరేంద్రమోడీ శనివారం విడుదల చేశారు. జాతీయ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం అవి అందుబాటులో ఉంటాయి. వాటిలో ఉన్న వివరాల ప్రకారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణించిన విషయాన్ని 1962లోనే నేతాజీ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ నేతాజీ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారని వాటిలో ఉంది. ఇదంతా పాత విషయాలే కావడంతో ఈ ఫైళ్ల విడుదల కేవలం ప్రహసనంగానే తప్ప ప్రయోజనకరంగా లేదని నేతాజీ అభిమానులు అంటున్నారు.

మరోవైపు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ను 'లీడర్‌ ఆఫ్‌ ది నేషన్‌' (జాతి నేత)గా ప్రకటిస్తామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. డాక్యుమెంట్లు - సాక్ష్యాల ఆధారంగానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తాము విశ్వసిస్తామని చెప్పిన ఆమె నేతాజీకి సంబంధించిన వాస్తవాలను యువతకు, భవిష్యత్‌ తరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.