Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ సరికొత్త రికార్డ్

By:  Tupaki Desk   |   7 Oct 2020 2:00 PM GMT
ప్రధాని మోడీ సరికొత్త రికార్డ్
X
సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రధానిగా మారేవరకు నరేంద్రమోడీ ఒక్కటంటే ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. వరుసగా గుజరాత్ సీఎంగా.. ఆ తర్వాత దేశ ప్రధానిగా సేవలందించారు. ఇదో అరుదైన ఘనతే అని చెప్పాలి. దేశ ప్రధానిగా పలు విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్రమోడీ కొత్త రికార్డును తాజాగా సృష్టించారు.

సీఎంగా.. ప్రధానిగా నరేంద్రమోడీ నేటితో 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవడం విశేషంగా చెప్పవచ్చు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అక్టోబర్ 7 - 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా మోడీ బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడు సార్లు గుజరాత్ సీఎంగా చేశారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తిరుగులేని నేతగా చక్రం తిప్పారు.

బీజేపీని దేశంలో రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. బీజేపీని ఇప్పుడు దేశంలోనే పటిష్టంగా నిలిపారు. 2014 - 2019లో ప్రధానిగా రెండు సార్లు ఎన్నికై కొనసాగుతున్నారు.

ఇలా పాలకుడిగా నరేంద్రమోడీ 20 ఏళ్లు పూర్తి చేశాడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా.. దేశ ప్రధానిగా మోడీ పాలనలో తన మార్క్ చూపించారు.