Begin typing your search above and press return to search.

బాబుకు లెక్కలు చెప్పేందుకు మోడీ రెఢీ?

By:  Tupaki Desk   |   20 Aug 2015 6:10 AM GMT
బాబుకు లెక్కలు చెప్పేందుకు మోడీ రెఢీ?
X
అప్పు అడిగేవాడు ముందు తన బాధలు.. కష్టాల గురించి మనసు కరిగిపోయేలా చెబుతుంటారు. వినే వ్యక్తి అప్పు ఇచ్చేందుకు రెఢీ అయితే సరి. లేకుంటే.. రివర్స్ గేర్ లో తనకున్న ఇబ్బుందల్ని ఏకరవు పెట్టటం మామూలే. అదే విధంగా కేంద్ర సాయం కోసం త్వరలో ప్రధాని మోడీని కలవాలని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి.. విభజన కారణంగా ఏపీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల గురించి దయనీయంగా చెప్పుకునేందుదకు.. విభజన కారణంగా తామెంత నష్టపోయిందన్న విషయాన్ని.. కేంద్రాని మరింత భాగా అర్థమ్యేలా బాబు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

బాబు వాదనకు చెక్ పెట్టే తరహాలో తన వాదనను కేంద్రం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి లేవనెత్తే అంశాలకు ధీటుగా ఉండేలా.. ఏపీకి కేంద్రం నుంచి అందిన సాయాన్ని ప్రస్తావించటం ద్వారా బాబు నోటి నుంచి మాట రాకుండా చేయాలన్నది కేంద్రం ఆలోచనగా ఉంది. అంతేకాదు.. ఏపీని తాము పట్టించుకోకుండా ఉండలేదని.. సాయం చేస్తున్నామని చెప్పటం ద్వారా.. పెద్ద మొత్తంలో ప్యాకేజీ అడగకుండా ముందరకాళ్ల బంధం వేయాలన్న ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు చెబుతున్నారు.

గత 14 నెలల కాలంలో ఏపీకి కేటాయించిన నిధులు.. విడుదల చేసిన మొత్తానికి సంబంధించిన నివేదిక ఒకటి తయారు చేయాలని పీఎంవో నుంచి ఆర్థిక శాఖకు ఒక లేఖ అందటం.. దానికి తగ్గట్లే ఆర్థిక శాఖ ఒక నివేదికను సిద్ధం చేసి.. ఫీఎంవోకు పంపటమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఏపీకి రూ.65వేల కోట్ల వరకూ కేటాయింపులు జరిపినట్లుగా ఆర్థికశాఖ లెక్కలేసింది. ఇందులో దాదాపు రూ.23.8వేల కోట్ల వరకూ నిధులు విడుదల చేసినట్లుగా పేర్కొంది. మొత్తం 40 శాఖలకు సంబంధించినవిగా ఈ లెక్కలు చెబుతున్నారు. ఈ మొత్తం.. పన్నుల వాటాలో భాగంగా నిధులకు అదనంగా కేంద్రం పేర్కొంది. మొత్తంగా చూస్తుంటే.. త్వరలో ప్రధానిని కలిసే సందర్భంలో బాబు డిమాండ్లకు తగిన సమాధానాల్ని గణాంకాల రూపంలో ప్రధాని మోడీ సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెప్పొచ్చు.