Begin typing your search above and press return to search.
వీసాల ఇష్యూ మీద మోడీ అలెర్ట్ అయ్యారండోయ్
By: Tupaki Desk | 2 May 2017 5:20 PM GMTఒకటి తర్వాత ఒకటిగా దేశాలు వీసాల ఇష్యూలో భారత్ కు దెబ్బేస్తుంటే ఏ మాత్రం రియాక్ట్ కాని ప్రదాని మోడీ.. ఈసారి మాత్రం డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. తన ఎన్నికల ప్రచారంలో.. తాను కానీ పవర్ లోకి వస్తే వీసా ప్రోగ్రామ్ మీద పరిమితులు విధిస్తానని చెప్పిన ట్రంప్.. అదే తీరులో వ్యవహరించినా.. భారత్ తన స్పందనను పెద్దగా వినిపించింది లేదు. వినిపించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అనుకుందో ఏమో కానీ.. ట్రంప్ నిర్ణయంపై మౌనంగా ఉండిపోయింది.
అయితే.. అమెరికా నిర్ణయం తర్వాత ఒక్కొక్క దేశం తమ వీసా రూల్స్ ను మార్చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇది భారతీయుల్ని దెబ్బ తీసేలా మారింది. అమెరికాతో పాటు.. ఆస్ట్రేలియా.. సౌదీ అరేబియాలాంటి దేవాలు తమ వీసా ప్రోగ్రామ్ మీద మార్పులు చేస్తున్నాయి. తాజాగా ప్రతిభావంతులైన నిపుణుల వీసా రూల్స్ ను కఠినతరం చేస్తూ ఆస్ట్రేలియా ప్రధాని తీసుకున్న నిర్ణయంపై మోడీ రియాక్ట్ అయ్యారు.
ఆస్ట్రేలియా ప్రధానికి ఫోన్ చేసిన మోడీ.. వీసా నిబంధనల్లో తీసుకొస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. 95 వేల మందికి పైగా ఉన్న ఫారిన్ వర్కర్లు ఆస్ట్రేలియా ఉపాధి పొందుతున్న వీసా ప్రోగ్రామ్ 457ను ఈ మధ్యన రద్దు చేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఈ తీరుపై భారత్‌కున్న అభ్యంతరాన్ని మోడీ వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. తాజా ఫోన్ సంబాషణలు ఆస్ట్రేలియా ప్రధానిపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా వీసా నిబంధనలపై ట్రంప్ ఎంతకూ తగ్గే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెచ్ 1బీ వీసాల విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా రియాక్ట్ కావాలని భారత్ భావిస్తున్నట్లుగా చెబుతున్నప్పటికీ.. ఇప్పటికే ఆలస్యమైందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/