Begin typing your search above and press return to search.

కుర్రాడి చెవి పట్టుకొని మోడీ హాస్యమాడారే

By:  Tupaki Desk   |   6 Feb 2016 2:10 PM GMT
కుర్రాడి చెవి పట్టుకొని మోడీ హాస్యమాడారే
X
ప్రధాని స్థాయి వ్యక్తి ఒక టీనేజర్ చెవి పట్టుకొని ఆల్లరిగా.. గుడ్ బాయ్ అంటే ఎలా ఉంటుంది? అలాంటిది సాధ్యమేనా? అన్న డౌట్ వస్తుంది. తాజాగా.. ప్రధాని మోడీ.. ఒక కుర్రాడి చెవిని పట్టుకొని ఆట పట్టించటం.. అదా కుర్రాడు సెల్ఫీ తీసుకొని ట్విట్టర్ లో పోస్ట్ చేయటం.. అదిప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ కుర్రాడెవరు? అతడి చెవిని మోడీ ఎందుకు పట్టుకున్నారన్న ఆసక్తికర విషయాల్లోకి వెళితే..

విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు బాలీవడ్ స్టార్ అక్షయ్ కుమర్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్ కు వచ్చిన ఆయన.. తనతో తన కుమారుడు అర్నవ్ ను వెంటబెట్టుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా ఆ కుర్రాడి చెవిని సరదాగా పట్టుకున్న మోడీతో సెల్ఫీ దిగేసిన అర్నవ్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.

దేశ ప్రధాని స్వయంగా తన చెవిని పట్టుకొని సరదాగా వ్యవహరించటం.. దాన్ని సెల్ఫీతో షేర్ చేసుకునే అవకాశం దక్కటంతో ఆ కుర్రాడు ఎగిరి గంతేయటమే కాదు.. తన జీవితంలో మర్చిపోలేని సంఘటనగా పేర్కొన్నాడు. తన కొడుకును దేశ ప్రధాని సరదాగా ఆట పట్టించటం ఆ కుర్రాడి తల్లిదండ్రులు అక్షయ్.. ట్వింకిల్ ఖన్నాలు ఆనందంతో మురిసిపోతున్నారు. అలాంటి సంఘటనలు ఏ తల్లిదండ్రులకు ఆనందాన్నివ్వవూ?