Begin typing your search above and press return to search.
కమాండర్ స్వాతి దేశానికి గర్వకారణం: ప్రధాని
By: Tupaki Desk | 25 March 2020 3:30 PM GMTకరోనా వైరస్ పేరు చెబితే ప్రపంచం బెంబెలెత్తిపోతోంది. చైనాలోని వూహాన్లో పుట్టిన ఈ వైరస్ క్రమంగా అన్ని దేశాలకు పాకింది. ప్రస్తుతం భారత్ లోనూ ఈ మహమ్మరి విజృంబిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ అక్కడి కంటే ఇటలీలోనే ఎక్కువగా కోరలు చాస్తోంది. కరోనా దెబ్బకు ఇటలీలో ఎక్కడ చూసిన శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. ఒకప్పుడు అందమైన ప్రదేశాలతో కళకళలాడిన ఇటలీకి వెళ్లేందుకు ప్రస్తుతం భయపడిపోతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో భారత మహిళ ఇటలీకి వెళ్లే సాహసం చేసింది. అంతేకాదు 263మంది భారతీయులను క్షేమంగా ఇండియాను తీసుకొచ్చింది.
కరోనా వ్యాప్తితో చాలా మంది భారతీయ విద్యార్థులు ప్రభావిత దేశాలలో చిక్కుకున్నారు. వీరిని సురక్షితంగా దేశానికి తరలించడానికి ప్రభుత్వం కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఎయిర్ ఇండియా బోయింగ్ కమాండర్ స్వాతి రావల్ చేసిన సాహసాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎయిర్ ఇండియాAI122ను రోమ్ నుంచి ఢిల్లీకి నడిపి 263మంది భారతీయులను ఆమె కాపాడింది. తన భార్య చేసిన ఈ సాహసాన్ని ఆమె భర్త అజిత్ కుమార్ భరద్వాజ్ ట్వీటర్లో షేర్ చేసి అభినందించారు.
కరోనా వైరస్ తో దెబ్బతిన్న దేశాల నుంచి భారతీయులను రక్షించడానికి కృషి చేసిన ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రధాని మోదీ ప్రశంసించారు. అలాగే కరోనా కేంద్రంగా వుహాన్ నుంచి భారతీయులను తరలించిన మొదటి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా అవతరించింది. ఈ విమానంలో 323మంది భారతీయులను, 7మంది మాల్దీవుల పౌరులను రక్షించించి మానవత్వాన్ని చాటుకుంది. దీంతో ప్రతీఒక్కరూ ఎయిర్ ఇండియా సేవలను కొనియాడుతున్నారు.