Begin typing your search above and press return to search.

ఏమీ ఇవ్వ‌కున్నా పొగ‌డ్త‌ల‌తో క‌డుపు నింపిన మోడీ

By:  Tupaki Desk   |   18 May 2016 6:18 AM GMT
ఏమీ ఇవ్వ‌కున్నా పొగ‌డ్త‌ల‌తో క‌డుపు నింపిన మోడీ
X
ప్ర‌ధాని మోడీ ఎంత మాస్ట‌ర్ అన్న విష‌యం ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు బాగా అర్థ‌మ‌వుతోంది. పైకి చెప్పే మాట‌ల‌కు.. చేసే చేష్ట‌ల‌కు ఏమాత్రం సంబంధం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యం వారిప్పుడు అనుభ‌వ‌పూర్వ‌కంగా తెలుసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కాస్తంత చిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంద‌ని చెప్పాలి. ప్ర‌త్యేక హోదా ద‌గ్గ‌ర నుంచి ఏపీకి రావాల్సిన నిధుల వ‌ర‌కూ చాలానే అంశాల్ని ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించి.. రాష్ట్రానికి ఎంతోకొంత ప‌ని చేయించుకోవాల‌ని బాబు భావించారు. అయితే.. ఏపీ అవ‌స‌రాల‌కు సంబంధించి సానుకూలంగా స్పందించ‌ని మోడీ.. అందుకు భిన్నంగా బాబు స‌ర్కారును పొగిడేసిన వైనం కాస్త ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి.

డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మంలో దేశ వ్యాప్తంగా 2.5ల‌క్ష‌ల పంచాయితీల‌కు బ్రాడ్ బాండ్ క‌నెక్టివిటీ ఇవ్వాల‌ని కేంద్రం ఓ కార్య‌క్ర‌మాన్ని షురూ చేయ‌టం తెలిసిందే. నేష‌న‌ల్ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ ప్రోగ్రాంలో భాగంగా ఏపీ స‌ర్కారు అనుస‌రించిన వైనాన్ని మోడీ ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. ఏపీని చూసి నేర్చుకోవాల‌ని మిగిలిన రాష్ట్రాల‌కు సూచించింది.

ఏపీ స‌ర్కారు ఎల‌క్ట్రిక‌ల్ పోల్స్ మీదుగా అప్టిక‌ల్ ఫైబ‌ర్‌ కేబుల్ లైన్స్‌వేయ‌టాన్ని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కేంద్ర స‌ర్కారు చెప్ప‌టం చూస్తుంటే.. బాబు స‌మ‌ర్థ‌త ఏమిటో తెలుస్తుంది. దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని విధంగా శ్ర‌మిస్తున్న ఏపీ స‌ర్కారుకు కేంద్రం త‌న వంతుగా అందించాల్సిన సాయం విష‌యంలో నోరు విప్ప‌న‌ప్ప‌టికీ..పొగిసేడి క‌డుపు నింపు కార్య‌క్ర‌మంలో మాత్రంఎలాంటి లోటు చేయ‌టం లేద‌ని చెప్పాలి. మాట‌ల‌తో క‌డుపు నింపు కేంద్ర స‌ర్కారుతో ఏపీకి ప్ర‌యోజ‌నం గుండు సున్నా అని చెప్ప‌క త‌ప్ప‌దు.