Begin typing your search above and press return to search.
మోడీ పాపులారిటీకి నో ప్రాబ్లం
By: Tupaki Desk | 7 April 2016 11:15 AM GMTసార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక రేంజిలో ఉన్న మోడీ మోజు క్రమంగా తగ్గుతోందా... ? లేదంటే అలాగే ఉందా అన్న చర్చ కొద్దికాలంగా జరుగుతోంది. అయితే... అడపాదడపా ఈ విషయంలో జరుగుతున్న సర్వేలు మాత్రం మోడీ ప్రభ తగ్గినా మరీ అంత దారుణంగా పడిపోలేదని చెబుతున్నాయి. రీసెంటుగా జరిగిన మరో సర్వే కూడా అదే విషయం వెల్లడించింది. భారత మధ్యతరగతి ప్రజల్లో అందునా, పట్టణ ప్రాంతాల్లోని వేతన జీవుల్లో మోడీపై ఉన్న నమ్మకం ఎంతమాత్రమూ తగ్గలేదని ఇటీవల ఈటీ-టీఎన్ ఎస్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుందని 86 శాతం మంది, కొత్తగా ఉద్యోగ సృష్టి జరిగిందని 62 శాతం మంది, భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందని 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వల్లే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీలో గొడవలకు కాంగ్రెస్ కారణమని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 52 శాతం మంది ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని పేర్కొన్నారు.
ఇక వ్యక్తిగత పాప్యులారిటీ విషయానికి వస్తే, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో పోలిస్తే, నరేంద్ర మోదీ ఎంతో ఎత్తున ఉన్నారు. మోదీ 10 పాయింట్లకు గాను 7.68 పాయింట్లు తెచ్చుకోగా, రాహుల్ కు 3.61 పాయింట్లు మాత్రమే వచ్చాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 41 శాతం మంది మోదీకి 10కి 9 మార్కులేశారని ఈటీ-టీఎన్ ఎస్ వెల్లడించింది. హైదరాబాద్ సహా ఢిల్లీ - ముంబై - చెన్నై తదితర 7 మెట్రోల్లో సర్వే నిర్వహించామని, 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారిని ఇందులో భాగస్వాములను చేశామని పేర్కొంది. రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షల వార్షికాదాయం ఉన్న కుటుంబాల్లోని వారిని ప్రశ్నించామని, సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపింది.
కాగా జేఎన్ యూ, హెచ్ సీయూల్లో చోటుచేసుకున్న ఘర్షణలు ఎన్డీయే ప్రభుత్వానికి మచ్చేనని చాలామంది భావిస్తున్నారు. కానీ, ఈ సర్వే ప్రకారం చూస్తే మాత్రం జేఎన్ యూ కల్లోలానికి కాంగ్రెస్సే కారణమన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు... ప్రభుత్వం ఆ విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరించినా ఫరవాలేదన్నభావనా కనిపించింది. సో... ఈ విషయంలో మోడీకి, బీజేపీకి ఏమైనా భయాలు ఉన్నా కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్న మాట.