Begin typing your search above and press return to search.

మోడీ చేతికి చిక్కిన‌ట్టే చిక్కి జారిపోయిన కాంగ్రెస్ సీఎం..?

By:  Tupaki Desk   |   11 May 2023 9:23 AM GMT
మోడీ చేతికి చిక్కిన‌ట్టే చిక్కి జారిపోయిన కాంగ్రెస్ సీఎం..?
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్యూహానికి చిక్కుకోని నేత‌లు అంటూ ఇటీవల కాలంలో పెద్ద‌గా ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వంటివారు కూడా మొద‌ట్లో కొంత చిక్కినా.. త‌ర్వాత‌.. వెనక్కు వ‌చ్చారు. ఇప్పుడు పెద్ద యుద్ధ‌మే చేస్తున్నారు. ఇదిలావుంటే.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాజ స్థాన్‌లో మ‌ళ్లీ బీజేపీ స‌ర్కారును కూర్చోబెట్టేందుకు ప్ర‌ధాని నరేంద్ర మోడీ చాలా వ్యూహాత్మ‌కంగానే అడుగు లు వేస్తున్నారు.

అయితే.. అనుకున్న విధంగా అక్కడ బీజేపీ దూకుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. దీంతో మోడీ.. కాంగ్రెస్ చిచ్చును త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. అశోక్ గెహ్లాట్‌ను బీజేపీవైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు కొన్నాళ్లుగా చేస్తున్నారు. గెహ్లాట్ అడ‌గ‌గానే.. ప్ర‌ధాని అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం.. ఇటీవ‌ల రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇక‌, తాజాగా 5000 కోట్ల రూపాయ‌ల ప్రాజెక్టుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. పైగా.. సీఎంను ఆయ‌న కొన్నాళ్లుగా పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. ఇదిలావుంటే.. కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు తెర‌మీద కి త‌ర‌చుగా వ‌స్తున్నారు.

స‌చిన్ పైల‌ట్ వంటి వారు సీఎం సీటుపై ఆశ‌లు పెట్టుకోవ‌డం.. కాంగ్రెస్ మాత్రం ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డం.. వంటివి కాంగ్రెస్‌లో నిత్యకృత్యంగా మారాయి. ఈ క్ర‌మంలో అశోక్‌ను త‌న‌వై పు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశార‌ని.. జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున క‌థ‌నాలు రాసింది.

అయితే.. అనూహ్యంగా సీఎం గెహ్లాట్‌.. ప్ర‌ధాని పాల్గొన్న స‌భ‌లోనే.. ఆయ‌న‌ను విమ‌ర్శించారు. నిన్న మొ న్నటి వ‌ర‌కు కేంద్రంపై ప‌న్నెత్తు మాట అన‌ని గెహ్లాట్‌.. తాజాగా మాత్రం ప్ర‌ధాని విప‌క్షాల‌ను గౌర‌వించ‌డం లేద‌ని.. స‌భా ముఖంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీంతో మోడీ వేసిన పాచిక పార‌లేద‌నే వాద‌న తెర‌మీ దికి వ‌చ్చింది. మొత్తంగా చూస్తే.. అశోక్ వంటివారిని త‌మ‌వైపు తిప్పుకోగ‌లిగితే.. రాజ‌స్థాన్‌లో పాగా వేయ‌డం తేలిక‌వుతుంద‌నేది మోడీ వ్యూహం. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.