Begin typing your search above and press return to search.

యుద్ధం నుంచి యూపీ వ‌ర‌కూ..మోడీ వ్యూహం ఇదే !

By:  Tupaki Desk   |   8 March 2022 2:30 AM GMT
యుద్ధం నుంచి యూపీ వ‌ర‌కూ..మోడీ వ్యూహం ఇదే !
X
ఎక్క‌డో ఉక్రెయిన్ లో యుద్ధం..అయినా భార‌త్ లో మాత్రం యుద్ధం ఆన‌వాళ్లు.. ఎందుక‌ని? ఎక్క‌డో ఉక్రెయిన్ లో పేలుడు మ‌న ద‌గ్గ‌ర ఉలిక్కిపాటు.. ఎందుక‌ని? మ‌న మ‌ధ్య దూరాలు కొల‌వలేనంత అంటారు కానీ అవ‌న్నీ అబ‌ద్ధాలు ఎన్ని దూరాలు అయినా చెరిపివేసేంత శ‌క్తి మ‌న‌లో లేదు.లేని కార‌ణంగానే మ‌నం మ‌రిన్ని పోరాట‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్నాం.ఈ క్ర‌మంలోనే ప్ర‌తి చిన్న అవ‌కాశాన్నీ రాజకీయంగా మ‌లుచుకుని ల‌బ్ధిపొందేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్నాం. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణే ఆప‌రేష‌న్ గంగ.

ఉక్రెయిన్ నుంచి స్వ‌దేశానికి చెందిన విద్యార్థుల‌ను తీసుకుని రావ‌డంలో భార‌త ప్ర‌భుత్వం ఎంత‌గానో కృషి చేస్తోంద‌ని మోడీ అంటున్నారు.కానీ అవేవీ స‌రిగా లేని మాట‌లు అని విప‌క్షం అంటోంది.అందుకే ఆప‌రేష‌న్ గంగ మీడియాకు చాలా బాగానే ప‌నికి వ‌చ్చిన విష‌యం. ఓ ప‌నికిమాలిన స్టేట్మెంట్ ను ఎవ్వ‌రో ఇస్తే అది కూడా ప‌ట్టుకుని హంగామా చేస్తూ వ‌స్తున్నార‌ని బీజేపీ అంటోంది.

వాస్త‌వానికి త‌మ ప్ర‌భుత్వానికి ఉన్నంత చిత్త‌శుద్ధి ఎవ్వ‌రికీ లేద‌ని కూడా అంటోంది.అందుకే కాంగ్రెస్ ఇప్పించే స్టేట్మెంట్లు న‌మ్మ‌వద్ద‌ని హిత‌వు ప‌లుకుతోంది.ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి ఏడు విడ‌త‌ల యూపీ పోలింగ్ కు సంబంధించి చివ‌రి రెండు విడ‌త‌లూ కూడా యుద్ధ సంబంధ స‌మ‌యంలోనే జ‌రిగాయి.

ఒక‌టి మార్చి 3న మ‌రొక‌టి మార్చి ఏడున అంటే ఈ రెండు విడ‌త‌ల్లో బీజేపీ చేసిన ఆప‌రేష‌న్ గంగ ప్ర‌భావం, ప్ర‌ధాని చెప్పిన భావోద్వేగ మాట‌లు ప్ర‌భావితం చేస్తే యోగీనే మ‌ళ్లీ సీఎం.. అలా కాకుండా త‌న‌కు తెలిసిన దారుల్లో వెళ్తున్న విప‌క్షాల‌కు మ‌రో ఛాన్స్ ఉంటే ఉంటుంది.అంటే ఈ యుద్ధాన్ని సంబంధిత స‌మ‌యాన్ని రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రి అవ‌సరాల‌కు అనుగుణంగా వాళ్లు వాడుకుని వ‌దిలేస్తున్నారు అన్న‌ది ప‌చ్చి నిజం.