Begin typing your search above and press return to search.
మోడీ పక్కా ప్లాన్: బిల్లులు ఆమోదం పొందడం ఖాయమా?
By: Tupaki Desk | 19 July 2021 12:30 PM GMTపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. తొలిరోజే పెట్రో ధరలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.ఈ సమావేశాలను ప్రతిపక్షాలు వాడుకోవాలని యోచిస్తున్నాయి. మోడీ సర్కార్ ను ఇరుకునపెట్టాలని చూస్తున్నాయి. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ బరిలోకి దిగుతోంది. పలు కీలక చట్టాలను, బిల్లులను ఆమోదించుకోవాలని పట్టుదలగా ఉంది. 17 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ప్రధాన సమస్యలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. ఇప్పటికే తొలిరోజు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆందోళన చేశాయి. ఇక నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయని నిరసన తెలిపాయి.
వీటితోపాటు సాగు చట్టాల రద్దు, కరోనా నియంత్రణ, టీకా పంపిణీ, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం, చైనాతో సరిహద్దు సంక్షోభం, దేశ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ఇప్పటికే షూరూ చేసింది.కరోనాను ఎదుర్కోవడం.. ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సమ్మతించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సర్వం సిద్ధమైంది. కొత్తగా 17 బిల్లులను ఈ సారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో అమలవుతున్న బిల్లులపై సైతం పార్లమెంట్ ముందుకు రానుంది.
ఇవేకాకుండా లోక్ సభలో 4, రాజ్యసభలో 3 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఉమ్మడిపౌరస్మృతి అందులో కీలక బిల్లుగా ఉంది.
వివాదాస్పద జనాభా నియంత్రణ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ప్రైవేటు బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పలువురు బీజేపీ ఎంపీలు వీటిని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. లోక్ సభలో ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా వీటిని ప్రవేశపెట్టనున్నారు.
అయితే ఈ వివాదాస్పద బిల్లులను ప్రతిపక్షాల ఆందోళన నడుమ ఎలా ఆమోదిస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే మూజువాణి ఓటుతోనే వీటన్నింటిపై ఓటింగ్ లేకుండా ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది.