Begin typing your search above and press return to search.
ఎవరి మాటా వినని పుతిన్ మోడీ ఫోన్ కాల్ తో...?
By: Tupaki Desk | 2 March 2022 2:30 PM GMTఅదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది. నాకు తిక్కరేగితే మా మాటే నేను వినను అని ఒక హీరో పాత్రధారి గట్టిగా చెబుతాడు. ఇపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి కూడా అచ్చం అలాగే ఉంది. పుతిన్ వీరావేశంతో ఉక్రెయిన్ మీద దూకుతున్నారు. ఉక్రెయిన్ ని మింగేయాలని పంతం పడుతున్నారు. ఈ విషయంలో ఆయనకు పెద్ద పెద్ద దేశాలే చెప్పి చూశాయి. కానీ పుతిన్ నేను ఎవరి మాటా వినను, మనిషి మాట అసలు వినను అని పక్కా క్లారిటీ ఇచ్చేశారు.
ఈ నేపధ్యంలో పుతిన్ తో ఎలా వేగాలో ప్రపంచ దేశాలకు అర్ధం కావడంలేదు. పుతిన్ మూడ్ ఏ క్షణాన ఎలా ఉంటుందో కూడా ఎవరూ అర్ధం చేసుకోలేకపోతున్నారు. పుతిన్ విషయంలో ఏం చేయాలో కూడా ఎవరికీ అసలు తెలియడంలేదు. ఆయన తనతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలే అని హెచ్చరిస్తున్నారు. ఇక చేసేది లేక కొన్ని రకాలైన ఆంక్షల పేరిట ఏదో చేస్తున్నామని అనిపించుకుంటున్నాయి పెద్ద దేశాలు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా పుతిన్ కి ఫోన్ చేసి తన పని తాను సవ్యంగా ఎవరైనా చేయించుకుంటే శభాష్ అనాల్సిందే కదా. మరి అంతటి ఘనతను మన ప్రధాని నరేంద్ర మోడీ సాధించారు. యుద్ధం స్టార్ట్ అయిన మరుసటి రోజే పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన మోదీ లేటెస్ట్ గా మరో సారి ఆయనకు కాల్ చేశారు. ఖార్కిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులను రష్యా మీదుగా తరలించాలని పుతిన్ ని మోడీ కోరారు.
మోడీ ఇలా కోరిన మీదటనే పుతిన్ కూడా రెండవ మాట కూడా లేకుండా ఎస్ అనేశారు. అంతే కాదు, భారతీయ విద్యార్ధుల క్షేమం కోసం ఆయన ఏకంగా కార్కిన్ లో యుద్ధాన్ని ఆరు గంటల పాటు వాయిదా వేశారు. వార్ ఆపేయండి అని సైనికులకు ఆర్డర్ వేశారు. అంతే కాదు, భారతీయ విధ్యార్ధులను సేఫ్ గా రష్యా మీదుగా తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయించారు.
నిజంగా ఈ ఘటన చూసిన వారంతా వారెవ్వా మోడీ అనేస్తున్నారు. పుతిన్ ఒక అగ్నిగోళంగా అణు బాంబులా ప్రపంచానికి కనిపిస్తూంటే మోడీ సార్ మాత్రం ఏమీ కాకుండా ఆయనతో కూల్ గా మాట్లాడుతున్నారు. రష్యా మీదుగా ఏ ఒక్క విదేశీ విమానం ఎగరని ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ విమానాలను ఎగరవేయించడమే కాదు, పుతిన్ సైతం ఏర్పాట్లు చేసేలా చూడడం అంటే మోడీ ఈజ్ గ్రేట్ అనక తప్పదేమో. ఇంకా పెద్ద విషయం ఏంటి అంటే ఉక్రెయిన్ తో చర్చల వేళ కూడా యుద్ధాన్ని ఆపని పుతిన్ భారతీయ విద్యార్ధుల కోసం ఖార్కివ్ లో ఆరు గంటల పాటు యుద్ధ విరామాన్ని ప్రకటించడం.