Begin typing your search above and press return to search.
కేరళ బాధితుల కోసం మోడీయే రంగంలోకి దిగారు
By: Tupaki Desk | 10 April 2016 7:45 AM GMT కేరళ కొల్లం జిల్లాలోని పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి,సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రధాని నరేంద్రమోడీ నేరుగా రంగంలోకి దిగారు. ప్రత్యేక విమానంలో ఆయన కొల్లం చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 102 మంది మరణించగా వందల సంఖ్యలో క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. ప్రధాని.. తన రాక సందర్భంగా ఎటువంటి ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని కేరళ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ విషాద సమయంలో ఎలాంటి స్వాగతాలు, అధికారిక మర్యాదలు వద్దని... తాను బాధితులకు సహాయం చేయడానికి వస్తున్నాని ఆయన చెప్పారు.
‘‘ఆపత్సమయంలో బాధితులను స్వయంగా పరామర్శించాలన్న ఉద్దేశంతో వచ్చాను. తన రాక వల్ల సహాయ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలి’’ అని ప్రధాని సూచించారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారికి కేంద్రం నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 300 మందికి పైగా ప్రజలు కాలిన గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రమాద అనంతర పరిస్థితులను సమీక్షించేందుకు ఈ మధ్యాహ్నం కేరళ మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆలయ నిర్వాహకులు, బాణసంచా లైసెన్సు దారులపై కొల్లాం పోలీసులు కేసును నమోదు చేశారు.
కాగా త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా అక్కడ కొన్ని సీట్లు సాధించాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆ కారణంగానే మోడీ డైరెక్టుగా రంగంలోకి దిగారని ప్రతిపక్షాలు చాటుమాటుగా విమర్శిస్తున్నాయి. అయితే... బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రధాని వస్తే రాజకీయ విమర్శలు చేయడం ఇది కరెక్టు కాదని... ఇది రాజకీయాలకు సమయం కాదని భాజపా వర్గాలు అంటున్నాయి.