Begin typing your search above and press return to search.
రాజ్యాంగ దినోత్సవం : అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారన్న మోడీ !
By: Tupaki Desk | 26 Nov 2021 10:30 AM GMTరాజ్యాంగ దినోత్సవ వేడుకలని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి మోడీ నివాళ్లు అర్పించారు. 2008లో ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా మనకు చాలా బాధాకరమైన రోజు అని ఆయన అన్నారు.
భారత రాజ్యాంగం నిర్మితమై 71 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్, టీఎంసీతో సహా 12 పార్టీలు బహిష్కరించాయి. ఆ రోజు మరణించిన ప్రతి ఒక్కరికీ నేను నివాళులర్పిస్తాను.
ఇతరులను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన మన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, ఈ రోజు మనం మన రాజ్యాంగం చెప్పినదంతా సమర్థిస్తున్నామా రాజ్యాంగాన్ని మన గొప్ప నాయకులు, భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన వారు రచించారు.
అయితే ఈరోజు మనం రాజ్యాంగంలోని ఒక పేజీని కూడా అనుసరిస్తున్నామా, మనం రాజ్యాంగాన్ని అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటి, దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అని మోడీ అన్నారు.
దేశ ఉజ్వల భవిషత్తు కోసం మన పెద్దలు ఎన్నో ఇచ్చారని,అందులో రాజ్యాంగం కూడా ఒకటని ప్రధాని మోడీ తెలిపారు. ఆ రాజ్యాంగమే మనల్ని రోజూ నడిపిస్తోందన్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో త్యాగాలు చేశారని, వారందరి త్యాగాల్ని పార్లమెంటు గుర్తుంచుకుంటుందన్నారు. రాజ్యాంగం ప్రకారమే దేశంలో వ్యవస్ధలు పనిచేస్తున్నాయని, మనం ఏం చేయాలన్నా రాజ్యాంగం ప్రకారంఅది సరైనదా కాదా అన్నది తెలుసుకుని చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు.
రాజ్యాంగం దేశంలో కోట్లాది మంది ప్రజలకు కరదీపికగా, దిక్సూచిగా మారిందని మోడీ వెల్లడించారు. ఈ దేశానికి బాబా సాహెబ్ అంబేద్కర్ బహుమతి రూపంలో ఇచ్చిన రాజ్యాంగాన్ని మనమంతా తూచా తప్పకుండా పాటించాలన్నారు. భారతదేశం సంక్షోభం వైపు వెళుతోందని, ఇది రాజ్యాంగం పట్ల అంకితభావంతో ఉన్నవారికి ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ తెలిపారు. ముఖ్యంగా కుటుంబ పార్టీల తీరు అని ప్రధాని
రాజ్యాంగం ప్రకారమే దేశంలో వ్యవస్ధలు పనిచేస్తున్నాయని, మనం ఏం చేయాలన్నా రాజ్యాంగం ప్రకారం అది సరైనదా కాదా అన్నది తెలుసుకుని చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. రాజ్యాంగం దేశంలో కోట్లాది మంది ప్రజలకు కరదీపికగా, దిక్సూచిగా మారిందని మోడీ వెల్లడించారు.
ఈ దేశానికి బాబా సాహెబ్ అంబేద్కర్ బహుమతి రూపంలో ఇచ్చిన రాజ్యాంగాన్ని మనమంతా తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా, మన హక్కులు రక్షించబడేలా విధి మార్గంలో ముందుకు సాగడం అవసరమని ప్రధాని తెలిపారు.