Begin typing your search above and press return to search.

భార్యేమో భ‌జ‌న‌... భ‌ర్తేమో విమ‌ర్శ‌ల వ‌ర‌ద‌... నిర్మ‌లమ్మ ఫ్యామిలీపై మోడీ క‌న్ను!

By:  Tupaki Desk   |   19 May 2023 5:00 AM GMT
భార్యేమో భ‌జ‌న‌... భ‌ర్తేమో విమ‌ర్శ‌ల వ‌ర‌ద‌... నిర్మ‌లమ్మ ఫ్యామిలీపై మోడీ క‌న్ను!
X
కేంద్రంలో మంత్రిగా ఉన్న బీజేపీ నాయ‌కురాలు.. నిర్మ‌లా సీతారామ‌న్ ఇంట్లో పెద్ద ఎత్తున వివాదం చెల రేగిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యంలో నిర్మ‌లా సీతారామ‌న్‌, ఆమె భ‌ర్త ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఇద్ద‌రూ కూడా ద్వంద్వ మార్గాల్లో ప‌య‌నిస్తున్నార‌నే వాద‌న‌బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో కూడా ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌.. విమ‌ర్శ‌లు చేసినా.. ఇప్పుడు ఏకంగా ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కు పెట్టారు. దీంతో విష‌యం ప్ర‌ధాని మోడీ వ‌ర‌కు చేరింది.

ఇటీవ‌ల ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు కిర‌ణ్ థాప‌ర్ చేసిన ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూలో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ మాట్లాడారు. దీనికి కార‌ణం.. గ‌త 9 ఏళ్ల‌లో భార‌త్ ఎలా నాశ‌నం అయిందో వివ‌రిస్తూ.. ప‌ర‌కాల పుస్త‌కం రాశారు. దీనిపైనే ఆయ‌న‌ను కిర‌ణ్ థాప‌ర్ ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ క్ర‌మంలో మోడీ విధానాల‌పై ప‌ర‌కాల తీవ్ర‌స్తాయిలో నిప్పులు చెరిగారు. 2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.

మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగ్నమయిందని, ఆర్థిక వ్యవస్థ--ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్‌ ప్రభాకర్‌ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా: ఎస్సేస్‌ ఆన్‌ ఎ రిపబ్లిక్‌ ఇన్‌ క్రైసిస్‌' ను ఈ నెల 14న బెంగళూరులో ఆవిష్కరించారు. దీనిపై నిర్వ‌హించిన కిర‌ణ్ థాప‌ర్ ఇంట‌ర్వ్యూలో ప‌ర‌కాల రెచ్చిపోయి మాట్లాడారు.

ఈ పుస్తకంలో దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, ఇతర సమస్యలపై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వరస వ్యాసాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో అభివృద్ధిపై విజయం సాధించినా, తరువాత నుంచి బీజేపీ హిందుత్వవాదాన్ని అనుసరిస్తోందని, లౌకికవాదాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. 2024 లో మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే...కేవలం దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా.. యావత్తు దేశానికే విపత్తు అని పరకాల ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల మధ్య విభజనతో లాభం పొందాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. తన పోరాటం హిందువులు--ముస్లింల మధ్య కాదని, పేదరికం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి చేసే పోరాటమని ప్రభాకర్‌ తెలిపారు. బీజేపీ, మోడీలు హిందుత్వం కోసం పాకులాడుతుంటే వారిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. మోడీ పాలన దేశ ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వహిస్తోందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

అర్థిక శాస్త్రంలో ప్రాథమిక శిక్షణ పొందిన ఏ ఆర్థిక వేత్తయినా.. ఇంత పెద్ద స్థాయిలో, ఇంత తక్కువ వ్యవధిలో పెద్ద నోట్ల రద్దుకు సిఫార్సు చేసి ఉండరని ప్రభాకర్‌ విమర్శించారు. నోట్ల రద్దు పెద్ద తప్పిదమ ని, తదనంతరం తీసుకున్న తప్పుడు విధానాలు ఈ తప్పిదాన్ని మరింతగా పెంచి సంక్షోభాన్ని, మరింత తీవ్రతరం చేశాయని ప్రభాకర్‌ విమర్శించారు. అయితే.. మ‌రోవైపు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భంగా సీతారామ‌న్‌.. మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మొత్తంగా భార్య ఒక‌వైపు.. భ‌ర్త మ‌రోవైపు.. ఇలా చేస్తున్న తీరుపై.. మోడీ క‌న్నేశార‌ని.. అసలు ఏం జ‌రుగుతోందో తెలుసుకుంటున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.