Begin typing your search above and press return to search.
మోడీ కేబినెట్ లో వాళ్లకు ఉద్వాసనే..!
By: Tupaki Desk | 4 July 2016 10:40 AM GMTదేశంలో తనదైన చరిష్మాతో 2014 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ప్రధాని నరేంద్రమోడీ.. ఆ తర్వాత కూడా తనదైన దూకుడుతో పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యంగా పని రాక్షసుడు అన్న పేరు తెచ్చుకున్న ఆయన.. తన మంత్రి వర్గం కూడా క్షణం తీరిక లేకుండా పనిచేయాలని బహిరంగ వేదికలపైనా చెబుతుంటారు. ఇంతవరకు బానే ఉన్నా.. కొందరు మంత్రులు సరిగా పనిచేయడం లేదని ఇటీవల ఆయన అంతర్గతంగా తెప్పించుకున్న నివేదిక ద్వారా తెలుసుకున్నారట. ఇక, వృద్ధాప్యం కారణంగా కొందరు మంత్రులు అంత యాక్టివ్ గా పనిచేయడం లేదని కూడా మోడీకి నివేదికలు అందాయి. దీంతో ఆయన మంగళవారం చేపట్టనున్న మంత్రి వర్గ విస్తరణలో తనదైన దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందని, వృద్ధ మంత్రులకు ఉద్వాసన పలకడం ఖాయమని తెలుస్తోంది.
అదేవిధంగా వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనూ ఆయా రాష్ట్రాలకు చెందిన బీజేపీ లేదా మిత్ర పక్షాలకు మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న - మధ్య తరహా పరిశ్రమల మంత్రి కైలాశ్ మహరాజ్ - మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాలు 75 ఏళ్ల పైబడ్డారు. దీంతో వీరిద్దరినీ తొలగించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మోడీ క్యాబినెట్ లో చక్కగా పనిచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్న మంత్రులకు ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వరుసలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ - చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లకు మోడీ ప్రమోషన్ వరం ఇవ్వవచ్చు. ఇక వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ను అలానే కొనసాగిస్తారా? శాఖ మారుస్తారా చూడాలి. నజ్మాను మైనారిటీ శాఖ నుంచి తొలగిస్తే.. ముఖ్తార్ అబ్బాస్ నక్వీకి ఆ పదవి లభించవచ్చని సమాచారం.
అదేవిధంగా సామాజిక న్యాయ శాఖ మంత్రి విజయ్ సాంప్లాను పంజాబ్ బీజేపీ చీఫ్ గా - యువజన వ్యవహారాలు - క్రీడా శాఖా మంత్రి శర్వానంద సోనోవాల్ ను అస్సాం ముఖ్యమంత్రిగా ఇప్పటికే పంపడంతో - ఈ రెండు పదవులూ ఖాళీగా ఉన్నాయి. ఇక అరుణ్ జైట్లీ వద్ద ఆర్థిక శాఖతో పాటు సమాచార - ప్రసారాల శాఖ కూడా ఉంది. ఆయన్ను ఆర్థిక శాఖకు మాత్రమే పరిమితం చేయాలన్నది మోడీ అభిమతంగా తెలుస్తోంది. దీంతో ఆయా శాఖలను కొత్తవారితో పూరించాల్సి ఉంటుంది. మరోపక్క - 2017లోగా గోవా - గుజరాత్ - పంజాబ్ - హిమాచల్ ప్రదేశ్ - మణిపూర్ - ఉత్తరాఖండ్ - ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ రాష్ట్రాల నుంచి కొత్త మంత్రుల చేరిక ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోవా పీఠం తిరిగి కైవసం చేసుకోవాలని భావిస్తున్న కమల నాథులు.. ఈ రాష్ట్రంపై పూర్తి పట్టున్న ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి - ఒకప్పటి గోవా సీఎం మనోహర్ పారికర్ ను తిరిగి ఆ రాష్ట్రానికే పంపిచే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల పారికర్ కూడా నర్మగర్భంగా ఒప్పుకున్నారు. తనకు ఢిల్లీ అతిథి గృహమని - గోవాయే సొంత ఇల్లని ఆయన చెప్పారు. దీనిని బట్టి ఆయనను గోవాకు పంపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఆయా మార్పులు చేర్పులపై 24 గంటల సస్పెన్స్ తర్వాతే విషయం తేటతెల్లమవుతుంది.