Begin typing your search above and press return to search.
బీహార్ ఎన్నికల ముందు మోడీజీ.. ఇప్పుడు మోడీ
By: Tupaki Desk | 6 Dec 2015 6:34 AM GMTపార్లమెంటులో ప్రధాని మోడీ పట్ల గౌరవం తగ్గుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో పార్లమెంటు పరిసరాల్లో పార్టీలకతీతంగా ఎవరి నోటి నుంచైనా మోడీజీ అన్న మాటే వినిపించేది. బీహారు ఎన్నికల తరువాత మోడీ అనే వినిపిస్తోందట. చాలామంది ఎంపీలు ఆయన్ను ఖాతరు చేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్లమెంటు నిర్వహణలోనూ అధికార పక్ష వైఫల్యం కనిపిస్తోంది.
శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే అధికార పక్ష ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని ఖాతరు చేయడం లేదా అనిపిస్తుంది. జీఎస్ టీ బిల్లు గురించి సోనియా -మన్మోహన్ సింగ్ లతో మాట్లాడిన తరవాత అధికారపక్షం పార్లమెంట్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. తాను చికిత్స కోసం అమెరికా వెళుతున్నానని, వచ్చాక జీఎస్ టీ పై మాట్లాడుదామని చెప్పడంతో ఆమె వచ్చే వరకు ఏమీ జరగకుండా ప్రభుత్వం మొక్కుబడిగా సభను నిర్వహిస్తుంది. అంతేకాదు బీహర్ ఎన్నికల తరువాత ప్రధాని మోడిని సీనియర్ ఎంపీలు ఖాతరు చేయలేదని తెలుస్తోంది . కొంత మంది జూనియర్ ఎంపీలు కూడా ప్రభుత్వం పై అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో కనీసం చిన్న పని కూడా చేయించుకోలేకపోతేన్నమని ఎంపీలు అంటున్నారు.
మరోవైపు ఫ్లోర్ మేనేజ్ మెంట్ అస్తవ్యస్తంగా ఉంది. లోక్ సభలో కోరమ్ ఉండడం లేదు. దీంతో స్పీకర్ చాలా ఇబ్బందికర పరిస్దితి ని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి కోరమ్ కూడా లేని విషయాన్ని విపక్ష నేత మల్లిఖార్లున ఖర్గే స్పీకర్ ద్రుష్టికి తేవాల్సి వచ్చింది. ప్లోర్ మేనేజ్ మెంట్ విషయంలో బీజేపీ అట్టర్ ప్లాఫవుతోంది. శుక్రవారం ఒక దశలో 543 మంది సభ్యలున్న పార్లమెంటులో కనీసం 55 మంది కూడా హజరు కాలేదు. ఈ వారం సమావేశాల తీరు ఎలా ఉంటుందో చూడాలి మరి.