Begin typing your search above and press return to search.
చైనాకు వ్యతిరేకంగా మోడీ పిలుపునివ్వలేదు
By: Tupaki Desk | 24 Oct 2016 5:22 AM GMTఈ దీపావళికి చైనాలో తయారైన వస్తువుల్నివినియోగించొద్దని.. భారతదేశంలో తయారు చేసినవాటినే కొనుగోలు చేయాలన్న సందేశాన్నిప్రధాని మోడీ ఇచ్చారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఉరీ ఉగ్రదాడి.. అనంతరం భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులతో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భావోద్వేగాలకు గురి అవుతున్నారు. తమ ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ ను దెబ్బ తీయటానికి ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకోవాలన్న భావనతో పాటు.. పాక్ కు అండగా నిలుస్తున్న చైనా మీద పరోక్ష పోరు చేపట్టాలన్న వాదన ఈ మధ్యన ఎక్కువైంది. ఇందులో భాగంగా చైనాలో తయారైన వస్తువుల్ని కొనుగోలు చేయొద్దంటూ ప్రధానమంత్రి కార్యాలయం పేరిట ఒక సందేశం.. ట్విట్టర్ లోని ట్వీట్ రూపంలో బయటకు వచ్చిందంటూ ఒక పోస్ట్ జోరుగా చక్కర్లు కొడుతోంది.
ప్రధాని మోడీనే స్వయంగా సందేశం ఇచ్చారన్న మాటతో.. ఈ వాదనకు భారీ ప్రచారం లభిస్తోంది. అయితే.. ఈ పోస్ట్ లో నిజం లేదని.. ఆ తరహాలో ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేయలేదన్న విషయాన్నికేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఆదివారం వెల్లడించారు. ప్రధాని సంతకం.. చిత్రంతో వస్తున్న చైనా వ్యతిరేక సందేశాలన్నీ అసత్యాలుగా స్పష్టం చేశారు. ఇలాంటి నకిలీ ట్వీట్ ను సామాన్యులే కాదు.. చివరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సైతం.. సదరు ట్వీట్ ను రీట్వీట్ చేయటం.. అది వివాదంగా మారింది. అయితే.. తాను రిట్వీట్ చేసిన ట్వీట్ నకిలీదన్న విషయం తేలటంతో ఆమె క్షమాపణలు చెప్పాలి. సో.. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం.. చైనా వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని.. కేవలం భారత్ తయారీ వస్తువుల్ని కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోడీ ఎలాంటి సందేశాన్ని ఇవ్వలేదన్న సమాచారం స్పష్టమైనట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/