Begin typing your search above and press return to search.
మోడీ అడిగిన లెక్క చెప్పే సత్తా కాంగ్రెస్ కు ఉందా?
By: Tupaki Desk | 27 March 2016 10:25 PM ISTఅసోం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ తన మేనేజ్ మెంట్ గురు మాటల్ని పక్కన పెట్టేశారు. పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిపోయారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల (తమిళనాడు.. పుదుచ్చేరి.. కేరళ.. పశ్చిమబెంగాల్.. అసోం) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్న అసోంలో ఆయన ప్రచారాన్ని తీవ్రతరం చేయటం తెలిసిందే. తాజాగా అసోం గురించి పదే పదే మాట్లాడుతున్న ఆయన.. తాను అడిగిన లెక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉందన్నారు.
ఇంతకీ మోడీకి చెప్పాల్సిన లెక్క ఏమిటన్నది చూస్తే.. స్వాతంత్ర్యం వచ్చే నాటికి అసోం రాష్ట్రం సంపన్నంగా ఉండేదని.. కానీ.. ఇప్పుడా రాష్ట్రం పేద రాష్ట్రంగా దని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలాంటి దుస్థితి ఏర్పడిందని.. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన మండిపడుతున్నారు. అసోం అభివృద్ధికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసిన మోడీ.. అసోం విషయంలో అక్కడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేతలు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
తాను అసోం ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత గగోయ్ మీద పోరాటం చేయటం లేదని.. ఆయన తొంభయ్యో పడికి దగ్గర ఉన్నారని... అలాంటి సీనియర్ నేత మీద తాను పోరాటం చేయటం లేదని.. తన పోరాటం.. ఆరాటం పేదరికం.. అవినీతి మీద మాత్రమేనని చెప్పటం ద్వారా అసోం ప్రజల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి.. మోడీ కోరినట్లు కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పే పరిస్థితుల్లో ఉందా? అన్నది ఒక ప్రశ్న. అదే ఉంటే.. మోడీ లెక్కే అడిగి ఉండే వారు కాదుగా.