Begin typing your search above and press return to search.

అదే జరిగితే బాలయ్య పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   22 April 2018 11:12 AM GMT
అదే జరిగితే బాలయ్య పరిస్థితేంటి?
X
రాజకీయ నాయకులు విమర్శలు చేసేటపుడు కొంచెం ముందు వెనుక చూసుకోవాలి. ఎవరిని అంటున్నాం.. ఏమంటున్నాం అన్నది ఆలోచించాలి. ఏదీ ఆలోచించకుండా వ్యాఖ్యలు చేసేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. నటుడు.. తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కొజ్జా అనడం.. ఆయన్ని జనాలు తరిమి తరిమి కొడతారనడం.. ఇంకా హిందీలో ఒక బూతు పదం కూడా వాడటం పెద్ద దుమారమే రేపింది. మోడీని ఉద్దేశించి బద్ధ శత్రువులు.. ఉత్తరాది నేతలు సైతం ఇలా మాట్లాడటానికి భయపడతారు. ఇగోయిస్ట్ అయిన మోడీ.. తన దారికి అడ్డొచ్చేవాళ్లను.. తనను తీవ్రంగా విమర్శించే వాళ్లను గుర్తుంచుకుని దెబ్బ కొడతాడనే పేరుంది. తనకు రాజకీయ భిక్ష ప్రసాదించిన అద్వానీతోనే మోడీ ఎలా వ్యవహరించాడో తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యల్ని మోడీ తేలిగ్గా తీసుకుంటాడా అన్నది సందేహం. తన గురించి ఎవరేం మాట్లాడుతున్నారో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ఉంటాడు మోడీ. అందులోనూ బాలయ్య వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగిన నేపథ్యలో ఈ సమాచారం మోడీకి చేరకుండా ఉండదు. పైగా బాలయ్య హిందీలోనూ ప్రసంగించాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోడీ భవిష్యత్తులో దెబ్బ కొట్టకుండా ఉండడు. నేరుగా బాలయ్యను కాకపోయినా.. చంద్రబాబు సమక్షంలోనే బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్నే లక్ష్యంగా చేసుకోవచ్చు. బాబే ఇలా మాట్లాడించాడని కూడా అనుకోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లోనూ మోడీనే గెలిస్తే బాలయ్యకు ఇబ్బంది తప్పకపోవచ్చు. కేంద్రంలో భాజపా గెలిచి.. ఇక్కడ తెలుగుదేశం ఓడిపోతే ఇక అంతే సంగతులు. అప్పుడు అదను చూసి బాలయ్యకు మోడీ పంచ్ ఇస్తాడేమో.