8 కాదు 12 : ఉద్యోగులకు మోడీ షాక్ !

Fri Jul 01 2022 08:00:01 GMT+0530 (IST)

modi on New labor laws

కోవిడ్ కారణంగా ఇప్పటికే  వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వేధించుకుతింటున్న ప్రయివేటు మరియు కార్పొరేటు సంస్థలకు మోడీ ఓ వరం ఇచ్చేశాడు. కొత్త కార్మిక చట్టాల అమలు ఒకవేళ జరిగితే ఇప్పటి కన్నా ఎక్కువ ఒత్తిడినే ఉద్యోగులు పొందాల్సి ఉంటుంది. వేతనాలు పెద్దగా మార్పు లేకపోయినా పని వేళల పెంపుదల అన్నది ఏ మాత్రం కూడా ఆమోద యోగ్యం కాదని సంబంధిత వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.రోజుకు ఇప్పటికే 12 నుంచి 16 గంటల పాటు ఆన్లైన్లో ఉంచుతూ గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న యాజమాన్యాలకు మరో అవకాశం మోడీ ఇవ్వనున్నారని అది  ఇప్పుడు రానున్న కొత్త కార్మిక చట్టాల ద్వారానే సాధ్యం కానుందని వీరంతా మండిపడుతున్నారు.
 
కొత్త కోడ్ ప్రకారం ఉద్యోగి గ్రాస్ జీతంలో 50% బేసిక్ పే ఉండాల్సి ఉందని ప్రధాన మీడియా చెబుతోంది.అదేవిధంగా పీఎఫ్‌కు ఇచ్చే వాటా కూడా పెరగనుంది.ఈ రెండూ పెద్దగా ఓ ఉద్యోగిని ప్రభావితం చేయలేవు కానీ ఆరోగ్యం రీత్యా ఇప్పుడున్న సిస్టంలో ఇమడడమే చాలా కష్టంగా తమకు ఉందని వీక్లీఆఫ్ లు 3 అని చెప్పి తరువాత వాటిని కూడా అమలు చేయడం తమ వల్ల కాదని కంపెనీలు చేతులు ఎత్తేయడం కూడా ఖాయమేనని అంటున్నారు.

ఇకపై నాలుగు రోజులే పనిచేయాలి. వారాంతంలో మూడు రోజులు వీక్లీ ఆఫ్ లు కానీ రోజుకు 12 గంటల పాటు పనిచేయాలి. ఇదే నిబంధన ఇప్పుడు ప్రయివేటు సెక్టార్లో ఓ కుదుపు కుదపనుంది. ఇప్పటికే అనధికార పని గంటలతో ఉద్యోగులను వేధించుకు తింటున్న కంపెనీలకు మోడీ తీసుకువస్తున్న కొత్త కార్మిక చట్టం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలు తగ్గిపోతున్నాయి.

అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాస్త పెరగనున్నాయి. ఏ విధంగా చూసుకున్నా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినానికి సెండాఫ్ చెప్పేయాలని కేంద్రం అంటోంది. ఇదే కనుక జరిగితే ప్రయివేటు కంపెనీలలో పనిచేస్తున్న వారు చుక్కలు చూడాల్సిందే !