Begin typing your search above and press return to search.

వెంకయ్య పెన్నుపై మోడీ కన్ను

By:  Tupaki Desk   |   5 Aug 2016 9:53 AM GMT
వెంకయ్య పెన్నుపై మోడీ కన్ను
X
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నోరు విప్పితే మాటల ప్రవాహమే.. ఈ మధ్య కాలంలో ఆయన పెన్నుతోనూ విజృంభిస్తున్నారు. పత్రికల్లో తెగ వ్యాసాలు రాసేస్తున్నారు. ముఖ్యంగా తనకు అనుకూలంగా వ్యవహరించే తెలుగు పత్రికల్లో పేజీలకు పేజీలు నింపేస్తున్నారు. తాను నిత్యం ఊదరగొట్టే ప్రసంగాలనే అటుతిప్పి ఇటుతిప్పి అందులోనూ రాసేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల ఇంగ్లీష్ పేపర్లలోనూ ఆయన పెన్ను పెడుతుండడంతో కష్టాలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఆయన రాతలు కాస్త రోతలుగా అనిపిస్తుండడంతో నేరుగా ప్రధాని మోడీయే అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

నాలుగు రోజుల కిందట వెంకయ్య ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఓ వ్యాసం రాశారు. అందులో ఆయన.. దళితులపై దాడులు కాంగ్రెస్ పుణ్యమేనని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చట్టాలను కరెక్టుగా ఉపయోగించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీంతో ఆయన ప్రస్తుత ప్రభుత్వానికేం సంబంధం అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లయింది. దీంతో వెంకయ్య రాతలపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో మోడీ కూడా వెంకయ్య అంత అడ్డగోలుగా రాయడాన్ని తప్పుబట్టినట్లు తెలుస్తోంది. వెంకయ్యా రాతలపై కన్నేసి ఉంచాలని ప్రధాని కార్యాలయం నిర్ణయించిదని ఎకనమిక్ టైమ్సులో దానిపై వార్తలొచ్చాయి. వెంకయ్య డీల్ చేస్తున్న సమాచార శాఖపై కన్నేసి ఉంచాలని మోడీయే సూచించినట్లు తెలుస్తోంది. మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాయకుండా.. అబద్ధాలు కూడా అదుపులో రాయాలని పీఎంఓ వెంకయ్యకు సూచనలు చేసినట్లు చెబుతున్నారు.