Begin typing your search above and press return to search.

గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్లో మోదీకి నెంబర్ వన్ స్థానం..!

By:  Tupaki Desk   |   4 Feb 2023 6:00 AM GMT
గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్లో మోదీకి నెంబర్ వన్ స్థానం..!
X
ప్రపంచ స్థాయి నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీనే నెంబర్ వన్ గా ఉన్నారని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ తాజాగా వెల్లడించింది. జనవరి 26 నుంచి 31 వరకు 22 దేశాల్లో సేకరించిన డేటా ప్రకారం మోదీ నెంబర్ స్థానంలో ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. మోదీ పట్ల 71 శాతం మంది అనుకూలంగా ఉండగా 21 శాతం మంది వ్యతిరేకంగా స్పందించడంతో ఆయన నెట్ అప్రూవల్ రేటింగ్ 50 శాతం ఉందని ఆ సంస్థ పేర్కొంది.

ఈ జాబితాలో బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. కాగా ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి నరేంద్ర మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో ఉంది. అయితే గత ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా ఆయన అప్రూవల్ రేటింగ్స్ తక్కువకు పడిపోయింది.

ప్రస్తుతం మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని వివిధ దేశాల నేతలకు సంబంధించిన అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసి వివరాలను పొందుపర్చింది. ఇందులో బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజాదరణ దారుణంగా పడిపోయింది. ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43గా నమోదైంది. ఆయనను 69 శాతం మంది డిజప్రూవ్ చేయడం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 43 శాతం అప్రూవల్ రేటింగ్.. కెనడా ప్రధాని జస్టిన ట్రుడుకు 43శాతం.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు 37శాతం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ కు 34శాతం.. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ-ఇన్ కు 38 శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 41 శాతం.. స్పెయిన్ ప్రధానిపెడ్రో సాంచెజ్‌లకు 40శాతం అప్రూవల్ రేటింగ్స్ వచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. ఏడురోజులపాటు వయోజనులైన ప్రజల మూవింగ్ యావరేజ్‌ను పరిశీలించి ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య ఆయా దేశాల్లో వేర్వేరుగా ఉందని ఆ సంస్థ పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.