Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాయకత్వం మోడీకి ఇష్టం లేదా?

By:  Tupaki Desk   |   30 Nov 2016 10:30 PM GMT
చంద్రబాబు నాయకత్వం మోడీకి ఇష్టం లేదా?
X
పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై వేసిన ముఖ్యమంత్రుల కమిటీకి ఏఫీ సీఎం చంద్రబాబు సారథ్యం వహించడం ప్రధాని మోడీకి ఇష్టం లేదా... తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన అంగీకరించారా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. నిజానికి మోడీ... బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు సారథ్య బాధ్యతలు అప్పగించాలనుకున్నారట. అత్యంత నిజాయతీపరుడైన నితీశ్ కే ఆ బాధ్యత అప్పగించాలని మోడీ సూచించారని.. జైట్లీ మాత్రం చంద్రబాబు పేరు నిర్ణయించారని.. అందుకు మోడీ తొలుత ససేమిరా అన్నా జైట్లీ సర్ది చెప్పడంతో సరేనన్నారని తెలుస్తోంది.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం రాగా అంతా తన చలవేనని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు ఆ తరువాత ఆ నిర్ణయం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడం.. వ్యతిరేకత రావడం చూసి ప్లేటు మార్చేశారు. తన జీవితంలో ఇలాంటి సమస్యను చూడలేదని చెప్పారు. ఒక దశలో మోడీ విఫలమయ్యారన్న భావన వచ్చేలా కామెంట్లుచేశారు. ఇదంతా మోడీ వరకు వెళ్లింది. నోట్ల రద్దు తర్వాత రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు మోడీకి నివేదిస్తున్న ఇంటిలిజెన్సు వర్గాలు ఏపీ సీఎం మాటలను ఎప్పటికప్పుడు పూసగుచ్చినట్లు ట్రాన్సులేట్ చేసి మరీ మోడీకి చేరవేశాయాట. దీంతో మోడీ చంద్రబాబు నియామకాన్ని వ్యతిరేకించారని తెలుస్తోంది.

అయితే... జైట్లీ మాత్రం రెండు కారణాలను చూపించి మోడీని ఒప్పించినట్లుగా చెబుతున్నారు. ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లుగా... నోట్ల రద్దు విషయంలో రెండు నాలుకలతో మాట్లాడుతున్న చంద్రబాబు బండారం బయటపెట్టడానికి గాను ఆయన్నే ఈ కమిటీకి సారథిగా నియమించి ఇరుకునపెట్టాలని జైట్లీ తన వాదన వినిపించారట. హుద్ హుద్ తుపాను సమయంలో అంత చేశా ఇంత చేశా అని గొప్పలు చెప్పుకొంటూ... నేనైతే ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని అలా అమలు చేసేవాడిని ఇలా అమలు చేసేవాడిని అంటున్న చంద్రబాబు ఈ కమిటీ నాయకుడిగా ఏం చేస్తారో చూద్దామని... ఆయన సామర్థ్యమేంటో దీంతో బయటపెడదామని జైట్లీ అన్నట్లు టాక్. ఒకవేళ నిజంగా మంచి సూచనలు చేయగలిగితే అది ఉపయోగపడుతుందని.. అలా కాకుండా చంద్రబాబు కమిటీ విఫలమైతే ఆయన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోతుందన్నది జైట్లీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే సబ్ కమిటీ సారథ్య బాధ్యత ఇప్పుడు చంద్రబాబుకు కత్తిమీద సామే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/