Begin typing your search above and press return to search.
ఇలాంటప్పుడూ సభలో ఉండరా మోడీ?
By: Tupaki Desk | 17 Nov 2016 9:52 AM GMTసందర్భానికి తగినట్లుగా వ్యవహరించటం చాలా అవసరం. అదేంటో కానీ ప్రధాని మోడీ మాత్రం అన్నింటికి ఒకే రీతిలో వ్యవహరిస్తూ లేనిపోని విమర్శలకు అవకాశం ఇస్తారని చెప్పాలి. పార్లమెంటు సమావేశాలు జరిగేదే అప్పుడప్పుడు. అలాంటి సమయంలో సభలో ఉంటే బాగుంటుంది. కానీ.. ప్రధాని మోడీ మాత్రం చాలా తక్కువ సమయాల్లోనే సభలో ఉంటారు. దీనిపై పలు సందర్భాల్లో ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మోడీ తీరును ప్రశ్నిస్తూ కనిపిస్తారు.
ఎంత ప్రధాని అయితే మాత్రం.. సాటి సభ్యులు చెప్పేది వినకుంటే.. తాముచెప్పేది ఎలా తెలుస్తుందన్న పాయింట్ లేవదీస్తుంటారు. వాస్తవంగా ఆలోచిస్తే ఇందులో ఎంతోకొంత నిజం లేకపోవచ్చు. అన్నీ సందర్భాల్లోనూ పార్లమెంటులో ప్రధాని ఉండాల్సిన అవసరం లేకున్నా.. కీలకమైన సమయాల్లో ఆయన లేకపోవటం తప్పుగా అనిపించకమానదు.
తాజాగా నోట్ల రద్దు అంశంపై పార్లమెంటు ఉభయ సభల్ని విపక్షాలు తీవ్రస్థాయిలో అడ్డుకుంటున్న వేళ.. విపక్ష సభ్యులు తమ వాదనను వినిపిస్తున్న సందర్భంగా ప్రధాని సభలో ఉండటం సముచితమన్న భావన ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఆయన సభలో ఉండకపోవటంపై గురువారం పలువురు సభ్యులు ప్రశ్నించటం కనిపిస్తుంది.
పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ జరగాలని పట్టుబడుతున్న విపక్షం.. ఇలాంటి సున్నిత అంశంపై రచ్చ జరుగుతున్న వేళ.. ప్రధాని సభకు రాకుండా ఉండటాన్ని తప్పు పడుతున్నారు. తమ వాదనను వినకుండా ప్రధాని ఎక్కడకు వెళ్లారంటూ తృణమూల్ కాంగ్రెస్.. కాంగ్రెస్.. బీఎస్పీ.. ఎస్పీ.. వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రధాని మోడీ సభకు హాజరు కావాలని.. చర్చలో పాల్గొని సమాధానం ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. కీలకమైన అంశాల్ని సభ్యులు ప్రస్తావిస్తున్న వేళ సభలో ఉండి.. వారు లేవదీస్తున్న అంశాలపై సమాధానాలు ఇవ్వటం ద్వారా దేశ ప్రజలకు తానేం చెప్పదలుచుకున్నది చెప్పుకునే వీలు ప్రధానికి ఉంది. కానీ.. ఆయన మాత్రం పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకపోవటాన్ని విపక్షాలే కాదు.. ప్రజలు కూడా అంగీకరించరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/