Begin typing your search above and press return to search.

రూపాయికి మోడీ కొత్త స్ట్రాటజీ... వర్కవుటయ్యేనా?

By:  Tupaki Desk   |   12 July 2022 8:30 AM GMT
రూపాయికి మోడీ కొత్త స్ట్రాటజీ... వర్కవుటయ్యేనా?
X
అంతర్జాతీయ స్థాయిలో మన కరెన్సీ రూపాయి విలువ పెంచటానికి చర్యలు మొదలయ్యాయా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయంగా రూపాయి విలువ పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

ప్రస్తుతం మన రూపాయి మారకం ప్రపంచదేశాల్లో నేపాల్, భూటాన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన దేశాల్లో ఎక్కడ కూడా రూపాయిల్లో చెల్లింపులను అనుమతించడం లేదు. ఎక్కడ చెల్లింపులు జరగాలన్నా డాలర్లలోనే జరుగుతోంది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. భారత్ తో వ్యాపార, వాణిజ్య వ్యవహారాలను నెరిపే ఏ దేశమైనా ఇకనుండి రూపాయల్లో కూడా చెల్లింపులను అంగీకరించేట్లుగా ఒప్పించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు, ఒప్పందాలను ఇతర దేశాలతో చేసుకునేందుకు వీలుగా బ్యాంకింగ్ వ్యవహారాల్లో వోస్ట్రో మార్పులు చేయాలని డిసైడ్ చేసింది.

వాణిజ్య భాగస్వామ్య దేశాల బ్యాంకుల్లో కూడా ఆర్బీఐ విజ్ఞప్తి మేరకు తమ బ్యాంకుల్లో మార్పులు చేసుకోవాల్సుంటుంది. దీని ప్రకారం భారత్ చేసే చెల్లింపులను డాలర్లలో కాకుండా రూపాయల్లో చేయటానికి వీలవుతుంది.

ప్రస్తుతం అవసరాల దృష్ట్యా రష్యా నుంచి దిగుమతి అవుతున్న చమురు ఇతర ఉత్పత్తుల చెల్లింపులను రూపాయల్లోనే చెల్లించేందుకు రష్యా ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఇది ప్రత్యేక పరిస్ధితుల్లో కాబట్టే సాధ్యమైంది. ఈ ప్రత్యేక పరిస్ధితినే భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయించాలని ఆర్బీఐ గట్టిగా ప్రయత్నిస్తోంది.

రష్యా లాగే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, చైనా, గల్ఫ్ దేశాలతో పాటు కొన్ని యూరోపు దేశాల నుండే ఎక్కువగా మనకు దిగుమతులు వస్తున్నాయి. పై దేశాలు కూడా రూపాయల్లో చెల్లింపులకు అంగీకరిస్తే రూపాయి విలువ అంతర్జాతీయంగా పెరుగుతుంది. ఇపుడు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బాగా తక్కువగా ఉంది. ఆర్బీఐ ప్రయత్నాలు సక్సెస్ అయితే ఇకనుండి చెల్లింపులన్నీ రూపాయల్లోనే జరుగుతాయి. అప్పుడు కొంతకాలానికి కచ్చితంగా డాలరంత కాకపోయినా పడిపోయిన రూపాయి విలువ పెరగటం ఖాయం.