Begin typing your search above and press return to search.

ఒకటో తరగతికి పిల్లాడ్ని స్కూల్ కు పంపేందుకు కొత్త రూల్

By:  Tupaki Desk   |   23 Feb 2023 9:47 AM GMT
ఒకటో తరగతికి పిల్లాడ్ని స్కూల్ కు పంపేందుకు కొత్త రూల్
X
విద్యకు సంబంధించిన సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కారు. విద్యార్థుల స్కూల్ ఆడ్మిషన్లకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న విధానాల్ని మారుస్తూ.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఒకటో తరగతిలో పిల్లల్ని చేర్చాలంటే వారికి తప్పనిసరిగా ఆరేళ్లు నిండి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

అప్పుడు మాత్రమే ఆడ్మిషన్ ఇవ్వాలని పేర్కొంది. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వుల్ని జారీ చేసింది. కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ముందు ఉండాలన్న ఉద్దేశంతో రెండున్నరేళ్లు వచ్చేసరికి ప్రీస్కూల్ కు పంపే ధోరణి ఈ మధ్యన పేరెంట్స్ లో ఎక్కువైంది. ఇది ఏ మాత్రం మంచి విధానం కాదని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. అయినప్పటికీ పిల్లల తల్లిదండ్రులు మాత్రం వీటిని ఖాతరు చేయటం లేదు.

ఇలాంటి నేపథ్యంలో కొత్త రూల్ ను తీసుకొచ్చిన కేంద్రం.. మూడు నుంచి ఎనిమిదేళ్ల మధ్యలో ఐదేళ్ల ఎలిమెంటరీ విద్యను కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇందులో మొదటి మూడేళ్లు నర్సరీ.. ఎల్ కేజీ.. యూకేజీ ఉండనున్నాయి.

ఆ తర్వాత ఒకటి.. రెండు తరగతుల్లో చేరాల్సి ఉంటుంది. అంటే.. ఒకటో తరగతి చేరే నాటికి విద్యార్థి వయసు తప్పనిసరిగా ఆరేళ్లు దాటి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పిల్లల శారీరక.. మానసిక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని చిన్న వయసులో స్కూల్ కు పిల్లల్ని పంపటం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే పేర్కొన్న వేళ.. మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.