Begin typing your search above and press return to search.
జమిలికి సై!... పావులు కదుపుతున్న మోడీ.. తెలుగు రాష్ట్రాల వ్యూహమేంటి?
By: Tupaki Desk | 15 Feb 2021 5:30 PM GMTజమిలి ఎన్నికలు. బీజేపీ పెట్టుకున్న అజెండాల్లో ఇది కూడా ఒకటి. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ అజెండాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని ఎత్తేశారు. అదేవిధంగా సీఏఏ వంటి వాటిని తీసుకువచ్చారు. రామజన్మ భూమిలో రామ మందిరం నిర్మించాలనే అతిపెద్ద ప్రాజెక్టును కూడా విజయవంతం చేశారు. అదేసమయంలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకలించి వేయాలని నిర్ణయించుకున్న ప్రధాన అజెండాను వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాల అధికారాలాను దాదాపు తగ్గించే ప్రయత్నం చేయడంలోనూ మోడీ సర్కారు సక్సెస్ అవుతోంది.
ఇక, ఈ దశలో.. ఇప్పుడు మిగిలింది.. జమిలి ఎన్నికలు. మోడీ సర్కారు తొలి విడత కేంద్రంలో అధికారం లోకి వచ్చిన నాటి నుంచి దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం తాజాగా వేగవంతమైన అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇటీవల జమిలి ఎన్నికలపై చర్చ జరిగింది. ఇందుకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉంటే.. మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో పాటు ఇతర ప్రధాన పార్టీలు రంగంలోకి దిగి తమ వ్యూహాలకు పదను పెడుతున్నాయి. ఎలాగైనా సరే ఆ రాష్ట్రాలను చేజిక్కించుకోవాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది
ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల కాన్సెప్ట్ మరోసారి తెరపైకొచ్చింది. ప్రధాని మోడీ కొద్ది రోజుల క్రితం `ఒక దేశం - ఒక ఎన్నిక` విషయంపై మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఈ తరుణంలో ఎంతో అవసరమని అన్నారు. జమిలి ఎన్నికలతో సమయం వృథా కాదని అదేసమయంలో ఖర్చు కూడా తగ్గి.. ప్రజాధనం వృథా కు అడ్డుకట్ట పడుతుందని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, ఖజానా కూడా కరిగిపోతోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దీనిని బట్టి జమిలిపై బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదానికి ఇది ఊతంగా మారింది.
ఇక, దేశంలో జమిలి ఎన్నికలు కొత్తకాదు.. 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. అయితే, ఆ తర్వాత 1959లో తొలిసారిగా ఈ ప్రక్రియకు కేరళలో బ్రేక్ పడింది.1957లో ప్రజాస్వామ్య పద్ధతిన ఏర్పడ్డ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను ఆయుధంగా చేసుకుని రద్దు చేయడంతో కేరళలో రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత 1960లో తిరిగి కేరళలో ఎన్నికలు జరిగాయి. తిరిగి 1967లో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తలెత్తడంతో ఒక దేశం ఒక ఎన్నిక విధానంకు బ్రేక్ పడింది. ఇలా కొన్ని కారణాలతో ఆయా రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరుగా జరిగాయి.
ఇక, ఆ తర్వాత లా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరిగి జమిలి ఎన్నికలకు వెళ్లాలని 1983లో అడుగులు పడినప్పటికీ సక్సెస్ కాలేదు. 2003 అప్పటి ప్రధాని వాజ్‌పేయి సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అంతేకాదు 2010లో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ కూడా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. అప్పట్లోనూ ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇక, ఇప్పుడు మోడీ తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జమిలికి అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందలేదు. ఒకవేళ జమిలి కాన్సెప్ట్‌పై ఇప్పుడు చర్చించినా.. టీడీపీ తప్పకుండా అంగీకారం తెలుపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బహుశ ఇదే వ్యూహంతోనే ఉన్నారో ఏమో.. కొన్నాళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జమిలి జపం చేస్తున్నారు. జమిలి వస్తే.. వైసీపీకి అడ్డుకట్ట పడుతుందని.. జగన్ అధికారం కోల్పోతారని పదేపదే పార్టీ సమావేశాల్లో చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీ కూడా జమిలి ఎన్నికలకు అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఎటొచ్చీ తెలంగాణలో బలంగా ఉన్న ఎంఐఎం పరిస్థితిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జమిలి ఎన్నికలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
జమిలి ఎన్నికలు జరిగితే.. రాష్ట్రాలకు ఒరిగే ప్రయోజనం ఏంటన్నది కూడా ఆసక్తిగా మారింది. జమిలితో ప్రధానంగా ఎన్నికల ఖర్చు తగ్గడంతోపాటు.. శాంతి భద్రత సమస్య కూడా తగ్గుతుందని అంటున్నారు పరిశీలకులు. 2009లో సాధారణ ఎన్నికలకు రూ.1115 కోట్లు ఖర్చు కాగా 2014 ఎన్నికలకు అది రూ.3,870 కోట్లకు చేరుకుందని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఒకవైపు ప్రజాధనాన్ని కాపాడుతున్నామని చెబుతూనే.. మరోవైపు బీజేపీ ప్రధాన అజెండాలో కీలకమైన జమిలిని అమలు చేయడం ద్వారా మోడీ తనదైన మార్కు సృష్టించనున్నారని తెలుస్తోంది.