Begin typing your search above and press return to search.
బర్త్ డే రోజున మోడీ ఇంటికెళ్లే ఒకే ఒక్కడు
By: Tupaki Desk | 17 Sep 2015 5:02 AM GMTప్రధానమంత్రి పుట్టినరోజు అంటే ఎంత హడావుడి ఉంటుంది? అందులోకి మోడీ లాంటి జనాకర్షక నేత జన్మదినోత్సవం అంటే ఆ హడావుడి ఒక స్థాయిలో ఉంటుంది. కానీ.. మోడీ మిగిలిన వారి మాదిరి కాదు. ప్రధానిగా ఉన్న ఆయన.. తన పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు ఏ మాత్రం మక్కువ ప్రదర్శించరు. సాదాసీదాగా ఉండేందుకే ఎక్కువ ఇష్టపడతారు. తాజా పుట్టినరోజుతో మోడీ 66 ఏట అడుగు పెట్టనున్నారు. 1950 సెప్టెంబరు 17న జన్మించిన మోడీ సాదాసీదా కుటుంబం నుంచి దేశాన్ని పరిపాలించేస్థాయికి చేరుకోవటం తెలిసిందే.
భారతదేశం లాంటి దేశంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక ఛాయ్ వాలా దేశ ప్రధాని కావటం మోడీకి మాత్రమే సాధ్యమైంది. బర్త్ డే అన్న వెంటనే భారీగా ఏర్పాట్లు చేసేయటం.. ధూంధాం అంటూ హడావుడి చేసే తీరుకు మోడీ భిన్నం. చివరకు కేక్ కూడా కట్ చేయరు. సన్నిహితుల్ని ఆహ్వానించరు. కుటుంబ సభ్యులు రావటం కూడా తక్కువే. అలాంటి మోడీ.. ఒక ప్రత్యేక వ్యక్తిని మాత్రం కలుసుకునేందుకు ఇష్టపడతారు. పుట్టినరోజు నాడు తనను కలిసేందుకు ఆయనొక్కరికి మాత్రమే అవకాశం ఇస్తారు.
ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి.. కేంద్రమంత్రులు శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉంది. కానీ.. పీఎంవో మాత్రం ఇప్పటివరకూ ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అంటే.. వీరెవరికీ బర్త్ డే విషెస్ చెప్పే అవకాశం లేనట్లే. ఇక.. రాజకీయంగానూ.. వ్యక్తిగతంగానూ తనకు అత్యంత సన్నిహితులైన పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలుసుకునే మోడీ.. తన పుట్టిరోజున కలిసే ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు? ఎవరికి లభించని అవకాశం ఆయనకు మాత్రమే ఎందుకు లభిస్తుందంటే.. గతంలోకి వెళ్లాల్సిందే.
ఇప్పుడంటే మోడీ దేశ ప్రధాని కానీ.. పదిహేనేళ్ల క్రితం ఆయన ఎవరికి తెలీదు. 2000లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలోని అశోకా రోడ్ లోని పార్టీ ప్రధాన కార్యలయంలో ఉన్న చిన్న గదిలో ఉన్న మోడీని అప్పట్లో ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఆ ఏడాది పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో పని చేసే ఒక వ్యక్తి మోడీ వద్దకు వచ్చిన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి.. స్వీట్ తినిపించారు. ఆ సమయానికి మోడీ జేబులో రెండు రూపాయిలే ఉన్నాయి. తనకు శుభాకాంక్షలు చెప్పిన వ్యక్తికి అదే విషయాన్ని చెప్పి.. ఏం కావాలని అడిగారట. అందుకు ఆ వ్యక్తి బదులిచ్చి.. రాబోయే రోజుల్లో మీరు ఇంకా పెద్ద పదవిలోకి వెళతారు.. అప్పుడు నన్ను గుర్తు పెట్టుకోండి చాలు.. నాకేమీ ఇవ్వొద్దంటూ చెప్పారంట. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఏడాది గుజరాత్ ముఖ్యమంత్రి కావటం.. ఆ తర్వాత వచ్చిన పుట్టిన రోజుకి (గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు) అతడ్ని గుర్తు పెట్టుకొని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి మరీ పంపారట. అప్పటి నుంచి ఆయన పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఆయనకు మాత్రమే దక్కుతుంది. ఈ ఏడాది ఆయనకు మాత్రమే మోడీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పే అవకాశం దక్కుతుంది. అదీ.. మోడీ అంటే.