Begin typing your search above and press return to search.
బాబు కోపం మోడీకి మంట పుట్టిందా?
By: Tupaki Desk | 1 Aug 2016 2:20 PM GMTఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశం మీద మోడీ ఒక స్థిర నిర్ణయానికి రావటం తెలిసిందే. ఏపీ మీద ఎందుకు కోపం వచ్చిందో కానీ.. హోదా ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దీంతో.. ఎవరెంత రచ్చ చేసినా ఏమీ పట్టనట్లుగా వ్యవహరించిన ప్రధాని మోడీలో కదలిక వచ్చింది. ఆచితూచి వ్యవహరించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోట ఘాటు మాటలు రావటం.. ఏంపీలతో సమావేశం సందర్భంగా ఆయన చేసిన .. ‘గుండె మండిపోతోంది’ లాంటి వ్యాఖ్యలకు సంబంధించిన అనువాద ప్రతులు మోడీని అలెర్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. దీని ఫలితమే తాజాగా.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో ప్రధాని భేటీ కావటంగా చెబుతున్నారు.
ఏపీ తెలుగు తమ్ముళ్లు ఢిల్లీలో నిరసన చేపట్టటం.. హోదా మీద కదం తొక్కుతున్న వేళ వెంకయ్యను పిలిపించుకున్న మోడీ.. హోదా వ్యవహారంపై జరుగుతున్న రచ్చపై మాట్లాడినట్లు తెలుస్తోంది. హోదాకు బదులు ఏపీకి ఇవ్వాల్సిన ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. ప్యాకేజీ కసరత్తు పూర్తి చేసిన తర్వాత.. ఆ విషయాన్ని ప్రకటన రూపంలో తెలియజేద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రత్యేక హోదా అంశంపై తాము పోరాటానికి దిగనున్నట్లుగా చంద్రబాబు తేల్చి చెప్పిన నేపథ్యంలో..ఇదేమాత్రం మంచిది కాదన్న భావనకు మోడీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ ఎంపీలు ఆందోళనతో ఆర్థికమంత్రి జైట్లీతో సమావేశమైన మోడీ.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీయటంతో పాటు.. ఏపీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా సమాచారం అందించి ఆందోళనల్ని ప్రస్తుతానికి ఆపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తడిగుడ్డ వేసుకున్నట్లుగా కూర్చున్న మోడీకి.. ఏపీ తెలుగు దేశం ఎంపీలు నినాదాల కంటే కూడా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం కదలిక తెచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి మాటల్ని పక్కన పెడితే.. అందులో నిజం ఎంతన్నది రానున్న రోజులే చెప్పనున్నాయని చెప్పాలి.