Begin typing your search above and press return to search.

విద్యార్థులతో మోడీ మన్ కీ బాత్.. ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   26 July 2020 9:30 AM GMT
విద్యార్థులతో మోడీ మన్ కీ బాత్.. ఏం చెప్పారంటే?
X
ప్రతీ ఆదివారం రేడియో ద్వారా తన మనసులోని భావాలను వ్యక్తం చేసే ప్రధాని నరేంద్రమోడీ ఈ ఆదివారం కూడా అదే పనిచేశారు. కానీ ఈసారి అతిథులు మాత్రం వెరీ స్పెషల్.. వారంతా చదువుకుంటున్న విద్యార్థులు కావడం విశేషం.

దేశవ్యాప్తంగా కొందరు ఎంపిక చేసిన విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ లో సంభాషించారు.వారి అభిరుచులను తెలుసుకొని వారి లక్ష్యాన్ని అందుకోవడానికి అహర్నిశలు కృషి చేయాలని హితబోధ చేశారు. ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని పాటుపడినప్పుడే ఉన్నత స్థితికి చేరుకుంటామని సూచించారు.

ఈ సందర్భంగా హర్యానా, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో మోడీ మాట్లాడారు. డాక్టర్ కావాలన్న హర్యానా విద్యార్థినికి కరోనా టైంలో డాక్టర్లు నిద్రను కూడా త్యాగం చేస్తూ సుఖసంతోషాలను వదిలేసి మనకోసం పాటుపడుతున్నారని.. ఈ వృత్తిని ఎంచుకోవడం సాహసంతో కూడినది మోడీ ప్రశంసించారు.

తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండి బాస్కెట్ బాల్ లో రాణించానని కేరళ విద్యార్థి వినాయక్ చెప్పగా మోడీ బిగ్గరగా నవ్వి.. అలా ఉండడం లక్కీ అని వ్యాఖ్యానించారు.

ఇక ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం సురినామ్ లో భారతీయులు స్థిరపడ్డారని.. ఆ దేశంతో భారత్ కు మూలాలున్నాయని.. ఏకంగా చంద్రికా ప్రసాద్ అనే భారతీయు మూలాలున్న వ్యక్తి ఆ దేశ రాష్ట్రపతిగా అవ్వడం మనకు గర్వకారణమని మోడీ ప్రశంసించారు. అలా మనది కాని చోట కూడా ఎదగాలని విద్యార్థులకు మోడీ సూచించారు.