Begin typing your search above and press return to search.

ఏటీఎం క్యూలో..మోడీ, మ‌న్మోహ‌న్‌, అద్వానీ!

By:  Tupaki Desk   |   14 Dec 2016 1:08 PM GMT
ఏటీఎం క్యూలో..మోడీ, మ‌న్మోహ‌న్‌, అద్వానీ!
X
ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, మాజీ ఉప ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ ఒకే వేదిక మీద‌కు రావ‌డం అరుదు.అందులోనూ వ‌రుస‌లో ఉండ‌టం ఇంకా అరుదు. పైగా త‌మ‌వంతు కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా ఉండేలా ఉంటే..ఎంతో అరుదైన దృశ్యం క‌దా? అలాంటి అరుదైన దృశ్యం ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సోష‌ల్ మీడియాలో ఏదైనా వైర‌ల్ అయితే ఇక చెప్పేదేముంది? కామెంట్లు - ఎమోజీలు - పంచ్‌ లు..ఇవ‌న్నీ కామ‌న్ క‌దా.

తాజాగా స‌ర్క్యులేట్ అవుతున్న ఈ ఫోటోలో ఈ ముగ్గురు ఉద్దండులు, ఆ వ‌రుస‌లోనే ఓ మూల‌గా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఉన్నారు. దీంతో నెటిజ‌న్లు ఒక‌టే పంచులు, కామెంట్లు వేసుకున్నారు! "పెద్ద నోట్ల ర‌ద్దు-కొత్త క‌రెన్సీ క‌ష్టాలు వీరికి కూడా మొద‌ల‌యిన‌ట్లున్నాయే"...అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. 'పానీపూరీ అమ్మేవాడు అమ్మాయిలకు మాత్రమే పానీపూరి ఇస్తే.. ఇలాగే ఉక్రోషంగా ఉంటుంది' అని మ‌రొక‌రు సెటైర్ పేల్చారు. ఇక మ‌రో తుంట‌రి అయితే "ఏటీఎంలో డబ్బు కోసం కాదు.. జియో సిమ్‌ కోసం క్యూ కట్టినట్టు ఉన్నారే" అని ట్వీటారు. ఇక బీజేపీ అభిమానుల సంగ‌తి స‌రే స‌రి.

"ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కొత్త రెండువేల నోటు, కాంగ్రెస్ నేత‌, మాజీ ప్ర‌ధాని మన్మోహన్ పాత వెయ్యినోటు, మాజీ ఉప ప్ర‌ధాని అద్వానీ పాత 100 నోటు" అంటూ విశ్లేష‌ణ చేశారు. "ముందు ప్రధాని-ఆ వెనుక‌ మాజీ ప్రధాని-ఎప్పటికీ ప్రధాని ఆశావహ అభ్యర్థి" అంటూ ఇంకొకరు ఈ ముగ్గురు నేత‌ల తీరును విశ్లేషించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/