Begin typing your search above and press return to search.
మోడీ మేనియాకు ఇదే నిదర్శనం
By: Tupaki Desk | 24 Jun 2019 5:12 AM GMTదేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చినాక మోడీ మేనియా మామూలుగా లేదు. ఇప్పటికే గడిచిన ప్రభుత్వ హయాంలో మోడీ జాకెట్స్, మోడీ శారీస్ ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు సరికొత్తగా ‘మోడీ మ్యాంగో’స్ తెరపైకి వచ్చాయి.
ఈ ఎండాకాలం దేశవ్యాప్తంగా మామిడి కాయల దిగుబడి వస్తాయి. ఈ సందర్భంగా యూపీ రాజధాని లక్నోలో ప్రతీ ఏటా మ్యాంగో ఫెస్టివెల్స్ నిర్వహిస్తారు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా మామిడి రైతులు విభిన్నమైన మామిడి ఉత్పత్తులను తీసుకొచ్చి ప్రదర్శించారు. అయితే ఇందులో మోడీ ఇమేష్ ను క్యాష్ చేసుకుంటూ ‘మోడీ మ్యాంగో’లను కొందరు రైతులు తీసుకొచ్చారు.
ఈ ఫెస్టివెల్ లో 450 గ్రాముల బరువుండే మ్యాంగోను రైతులు పేరు పెట్టి తీసుకొచ్చారు. దీనికి పేటెంట్ ను కూడా తీసుకున్నామని మ్యాంగో కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. మోడీ మ్యాంగో విశేష ఆదరణను చూరగొంటోందని తెలిపారు.
ఈ మ్యాంగో ఫెస్టివెల్ లో 700 కు పైగా ప్రముఖ మామిడి పళ్ల వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇటీవల ప్రధాని మోడీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో ఇంటర్వ్యూలో తనకు మామిడిపండ్లు అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. అందుకే మోడీ మేనియాలో ఆయన పేరుపై మామిడి వంగడం పుట్టుకొచ్చింది. ఇలా మోడీ మేనియాతో ఆయన పేర్లు ఇంకా ఎన్నింటికో పెట్టుకుంటారో చూడాలి మరీ..