Begin typing your search above and press return to search.

వీధి వ్యాపారులకు మోడీ సర్కార్ శుభవార్త !

By:  Tupaki Desk   |   27 Oct 2020 9:50 AM GMT
వీధి వ్యాపారులకు మోడీ సర్కార్ శుభవార్త !
X
వీధి వ్యాపారుల జీవితాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ మార్పు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ 3 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి వీధి వ్యాపారులకు ఆత్మ నిర్భర నిధి కింద రుణాలు పంపిణీ చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రుణ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ప్రయోజనాలను వారికి వివరించారు. అలాగే, వారి కష్టాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో చాలా నష్టపోయామని చెప్తే, వీధి వ్యాపారులు ప్రధాని మోదీకి వివరించారు.

మధ్య దళారులు లేకుండా నేరుగా వీధి వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం శుభ పరిణామం అని ఆయన అన్నారు. లోన్లు శాంక్షన్‌ చేసిన బ్యాంక్‌ ఉద్యోగులను ఆయన అభినందించారు. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారస్తులను ఆదుకోవడమే ఈ స్కీమ్‌ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశవ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, అందులో 12 లక్షల మందికి లోన్లు మంజూరు చేశామని మోదీ తెలిపారు. కాగా, జన్ ‌ధన్‌ అకౌంట్లను విపక్షాలు ఎద్దేవా చేశాయని, అయితే ఇప్పుడు ఆ అకౌంట్లే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడు తున్నాయన్నారు. అటు రోడ్ సైడ్ బండి లేదా వీధి, రహదారిపై దుకాణాలను నడిపేవారి మాత్రమే ఈ రుణాలను ఇస్తుండగా రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేవారికి ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తామని తెలిపారు.

వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన ఈ పథకం కోసం రూ.5000 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ రుణం కోసం, మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల రసీద లేదా చెల్లింపుపై కూడా నెలవారీ క్యాష్‌ బ్యాక్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.