Begin typing your search above and press return to search.
ఏయ్ ఇది గమనించారా? మోడీ మాష్టారికి జన ఘోష వినిపిస్తుంది
By: Tupaki Desk | 4 Nov 2021 9:59 AM ISTఫర్లేదు.. జనఘోష ఢిల్లీలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోడీకి వినిపిస్తుందన్న విషయం ఎట్టకేలకు అర్థమైంది. అయితే.. అదంతా మాటలతోనో.. సోషల్ మీడియాలో చెప్పుకునే ఆక్రోశం ద్వారా కాకుండా ఓటుతో మాత్రమే ఆయన మాట వింటారన్న విషయం తాజాగా ఫ్రూవ్ అయ్యింది. వ్యవసాయ విధానం మీద చేసిన మూడు చట్టాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్ల మీదకు వచ్చి నిరసనలు.. భారీ ఆందోళనలు చేసినా వినని మోడీ మాష్టారు.. తాజాగా వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటల్లోనే కీలక ప్రకటన వచ్చేయటం చూస్తే.. మోడీకి ఎలా చెబితే అర్థమవుతుందన్న విషయం మీద క్లారిటీ వచ్చిందని చెప్పాలి.
ప్రధానమంత్రి కుర్చీలో మోడీజీని కూర్చోబెట్టండి.. మీరు ఊహించనిరీతిలో మార్పులు తీసుకొస్తారు. లీటరు పెట్రోల్ రూ.70 ఏంటి? ఛండాలంగా.. మోడీ చేతికి కేంద్రం పగ్గాలు రావాలే కానీ.. లీటరు పెట్రోల్ రూ.50కు తీసుకొచ్చేస్తారంటూ 2014 ఎన్నికలకు ముందు బాకా ఊదినోళ్లు.. అప్పుడప్పుడే ప్రజల్ని ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా పోస్టులు వచ్చేవి. అంతేనా.. వాట్సాప్ లోనూ అలాంటి ప్రచారమే సాగింది.
ఎప్పుడెప్పుడు మోడీ మాష్టారు దేశ ప్రధాని అవుతారన్న ఆశ కోట్లాది మంది జాతి జనుల్లో వ్యక్తమైంది. కట్ చేస్తే.. ఆయన రెండోసారి ప్రధాని కుర్చీలో కూర్చున్న రెండున్నరేళ్లకు.. అంటే మొత్తంగా ఏడున్నరేళ్లకు లీటరు పెట్రోల్ రూ.110 దాటితే.. డీజిల్ రూ.105 వరకు చేరుకొన్న పరిస్థితి. అయినప్పటికీ.. పెరిగిన ధరల మీద నోరు విప్పితే దేశద్రోహి అన్న కామెంట్లు.. కుటుంబమే లేని మోడీ.. పెంచిన ధరలతో ఏం చేసుకుంటారు? ఇదంతా.. దేశ రక్షణ కోసం మాత్రమే అంటూ కొత్త వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చి.. మాట్లాడే గొంతులపై దేశభక్తి అనే అస్త్రాన్ని సంధించటం కమలనాథులకే చెల్లింది.
ఏదైనా విపత్తు ఎదురైనంతనే.. సోషల్ మీడియాలో స్పందించి పోస్టులు పెట్టే మోడీ మాష్టారు.. అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరల మీద మాట్లాడరు. పెట్రో ధరల మీదనే మన జీవితాలు ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని పట్టించుకోకుండా పెంచుకుంటూ పోయిన పుణ్యమా అని..కూరగాయలు.. నిత్యవసర వస్తువులు మొదలు అవి ఇవి అన్న తేడా లేకుండా అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయిన పరిస్థితి. స్థితిమంతుడు ప్రయాణించే విమానాలకు వినియోగించే ఇంధనం ధర కంటే సామాన్యుడు వాడే పెట్రోల్ ధర భారీగా పెరిగిపోవటం చూస్తే.. మోడీ మాష్టారి అచ్చేదిన్ ఎప్పుడన్నది ప్రశ్న.
అదే విషయాన్ని ఆయన్ను అడిగే ప్రయత్నం చేసేందుకు సామాన్యుడికి మార్గం లేని పరిస్థితి. మీడియా ముందుకు రాని మోడీ మాష్టారిని.. జనం ఆవేదన తెలిసేదెలా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటివేళ.. వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు మోడీ సర్కారు మీద ప్రభావం చూపినట్లైంది. అందుకు తగ్గట్లే.. పెట్రోల్.. డీజిల్ మీద ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న వైనాన్ని చూస్తే.. రానున్నరోజుల్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రజాతీర్పు మోడీ మాష్టారికి అర్థమయ్యేలా ఉంటే.. మరింత మార్పు రావటం ఖాయం. కాదంటారా?