Begin typing your search above and press return to search.
కేసులు పెరుగుతున్న వేళ సీఎంలతో మోడీ కీలక భేటి
By: Tupaki Desk | 11 Aug 2020 3:30 AM GMTదేశంలో కరోనా కల్లోలం మొదలైంది. విపరీతంగా కేసులు పెరుగుతూ కంట్రోల్ కావడం లేదు. వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఏపీలో అయితే ఒక చిన్న దేశంలో నమోదయ్యే కేసులు, మరణాలు సంభవిస్తుండడం కలవరపెడుతోంది.
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేల ఏపీ, తెలంగాణ సహా దేశంలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాసేపట్లో భేటికి నిర్ణయించారు.
ఏపీ, తెలంగాణతోపాటు బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాస్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ కీలక సమావేశంలో మోడీతోపాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్, ఆర్థిక మంత్రి నిర్మల, వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొననున్నారు.
ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాని అరికట్టడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై ప్రధానమంత్రి ఆయా రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తారు. కేసులు పెరగడానికి గల కారణాలపై ఆరా తీస్తారు.